Meals : మనం తినే ఆహారాన్ని నెమ్మదిగా తినడం మంచిదా.. లేక వేగంగా తినడం మంచిదా..?

Meals : ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ఆహారపు అలవాట్లు చాలా మారిపోయాయి. వీలు కుదిరినప్పుడే తినడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని తమ చేజేతులా ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. ఆహారం తినడమంటే కేవలం కడుపు నింపుకోవడమే కాదు. మనసునిండా తినాలని నిపుణులు వెల్లడిస్తున్నారు. అప్పుడే శరీరానికి అవసరమైన శక్తిని ఆహారం ద్వారా పొందగలమని అంటున్నారు. మరి అందుకు ఏం చేయాలి..? ఆరోగ్యాన్ని రక్షించుకునేందుకు ఎలాంటి ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

మన ఆరోగ్యం నిజానికి సరైన జీవన శైలిపై ముడిపడి ఉంటుంది. మరి సరైన జీవనశైలి అనేది ఆహారం, వ్యాయామం మరియు శుభ్రత మీద ఆధారపడి ఉంటుంది. సరిగ్గా నమలకుండా భోజనం చేసేవారు తినే ఆహారాన్ని వేగాన్ని విధానాన్ని కంట్రోల్లో ఉంచలేరు. ఒక్కోసారి తక్కువగా తింటే కొన్నిసార్లు పరిమితికి మించి తినేస్తూ ఉంటారు. ఇలా చేయటం అనేది జీవక్రియలు అస్తవ్యస్తం అవ్వడమే కాకుండా ఈ ప్రభావం హార్మోన్ల మీద కూడా చూపడం జరుగుతుంది. ఈ పరిస్థితులన్నీ మీ బరువు మీద ప్రభావితం చూపుతాయి. అంతేకాకుండా వేగంగా ఆహారం తినే వాళ్లకి ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ రోగాల బారిన పడినట్టుగా కొన్ని అధ్యయనాల ద్వారా వెల్ల‌డయ్యింది.

Meals

ఆహారాన్ని సరిగా నమలకుండా తినేవాళ్ళు రెండు రకాలుగా ఉంటారు. కడుపునిండటానికి భోజనం అనుకునేవాళ్ళు కొందరైతే.. భోజనం కోసమే జీవితమా అనుకునేవారు మరికొందరు. మంచి ఆహారాన్ని కోరుకునేవారు ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినాలి. అంటే భోజనాన్ని మింగటానికి ముందు కనీసం ఒక 15 సెకన్లు అయినా నమిలి మింగాలి. ఆహారం వేగంగా తినడం కన్నా రోజు వారి అలవాట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. మీ ఆహారపు అలవాట్లు ఆలోచనా విధానాలు అన్నీ ముఖ్యమైనవే. ఒక భోజనం చేసే సమయం కనీసం 20 నిమిషాలు తక్కువ కాకుండా చూసుకోండి.

ఇప్పుడు ఆహారం నెమ్మదిగా తినడానికి సహాయడే కొన్ని చిట్కాలు ఏమిటో చూద్దాం. మీరు తినే ఆహారం గురించి పూర్తిగా తెలుసుకోండి. కొద్దికొద్దిగా ఎక్కువ సేపు తినడానికి ప్రయత్నించండి ఇది నెమ్మదిగా నమిలి తినటంలో సహాయం చేస్తుంది. మీరు తినే గదిలో కొన్ని ఆంక్షలను పెట్టుకోండి. భోజనం చేసే సమయంలో ఫోన్లను టీవీలను గాడ్జెట్లను దూరంగా ఉంచండి. పూర్తిగా ఆహారాన్ని నమిలి మింగిన తర్వాతే మరొక ముద్ద తీసుకునేలా టైమింగ్ మెయింటెయిన్ చేయండి. హైడ్రేటెడ్ గా ఉండడం మంచిదే. కానీ చాలామంది భోజనంతో పాటు ఎక్కువ నీటిని తాగుతూ ఉంటారు. ఇది మంచి పద్ధతి కాదు. ఆహారం సక్రమంగా నమిలి తినడం వల్ల లాలాజలం ద్వారా మనకి కావలసిన ఆమ్లాలు పొట్టలోకి వెళ్లి ఆహారం త్వరగా జీర్ణం అవ్వడానికి తోడ్పడుతుంది. ఏదైనా ఆహారం మింగలేని సమయంలో కొద్దిపాటి నీళ్ళు త్రాగడం మంచిదే కానీ ఆహారంతో పాటు ఎక్కువ నీరు తీసుకోవడం అంతా సరైన పద్ధతి కాదు. కాబట్టి ఎలాంటి ఆర్భాటము లేకుండా నెమ్మదిగా ఆహారం తినడం ద్వారా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

Share
Mounika

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM