Artist Ravi Prakash : డాక్టర్ కాబోయే యాక్టర్లమయ్యామని సినీ ఇండస్ట్రీలో చాలామంది నటులు అంటుంటారు. ఈ కోవకు చెందిన సినీ ఆర్టిస్టులు ఎంతోమంది తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు. ఇక అదే కోవకి చెందిన వారిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ రవి ప్రకాష్ కూడా ఒకరు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సుమారు 200 కి పైగా చిత్రాల్లో నటించాడు. ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన శుభవేళ అనే చిత్రంలో కథానాయకుడిగా తన నట ప్రస్థానాన్ని ప్రారంభించాడు. మొదటి సినిమా తనకు ఆశించిన మేరకు సక్సెస్ సాధించకపోయినా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రం మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఎక్కువగా సహాయ పాత్రల్లో నటించాడు. ముఖ్యంగా రవిప్రకాష్ ఘర్షణ, అతడు, వేదం సినిమాల్లో పోషించిన పోలీసు ఆఫీసరు పాత్రలతో ప్రేక్షకులకు చేరువయ్యాడు. తమిళంలో వానం, పయనం, మాట్రాన్ లాంటి సినిమాల్లో నటించాడు. అయితే ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ ద్వారా రవి ప్రకాష్ తన గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.
నేను విశాఖలో పుట్టి పెరిగాను. లాసెన్స్‌బే కాలనీలో మా తల్లిదండ్రులు ఉంటున్నారని ఆయన తెలిపారు. విద్యాభ్యాసం అంతా విశాఖలోనే జరిగింది. విశాఖ వేలీ స్కూల్‌లో ఇంటర్మీడియట్ వరకు చదివానని, ఆ తర్వాత ఎంబీబీఎస్ మాస్కోలో చేశానని రవి ప్రకాష్ తెలిపారు. కొంతకాలం పాటు హైదరాబాద్‌లో డాక్టర్ ప్రాక్టిస్ చేశాను. ఆ తర్వాత స్నేహితులు, బంధువులు ప్రోత్సాహంతో అనుకోకుండానే సినీ రంగ ప్రవేశం చేశాను. 2000 సంవత్సరంలో తేజ దర్శకత్వంలో వచ్చిన శుభవేళ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయ్యానని రవి ప్రకాష్ వెల్లడించారు. అయితే క్రిష్ దర్శకత్వంలో వచ్చిన వేదం చిత్రంతో తనకు నటుడిగా మంచి పేరు తెచ్చిందని, అలా డాక్టర్ గా స్థిరపడాలనుకున్న నేను యాక్టర్ గా స్థిరపడ్డానని రవి ప్రకాష్ ఇంటర్వ్యూ ద్వారా తెలియజేశారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…