సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. మొత్తం 1000 క్రెడిట్ ఆఫీసర్ పోస్టులను ఈ నియామక ప్రక్రియలో భాగంగా భర్తీ చేస్తారు. బ్యాంకింగ్ రంగంలో ఎదగాలని చూస్తున్న వారికి ఇదొక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. జనరల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరిలకు చెందిన వారు 60 శాతం మార్కులతో డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఇతర కేటగిరిలకు చెందిన వారు 55 శాతం మార్కులతో డిగ్రీ పాస్ అయి ఉండాలి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థుల కనీస వయస్సు 21 ఏళ్లు ఉండాలి. గరిష్ట వయస్సు 30 ఏళ్లు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరిలకు చెందిన అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి. జనరల్ విభాగంలో 405 ఖాళీలు ఉండగా, ఓబీసీ విభాగంలో 270, ఎస్సీ 150, ఎస్టీ 75, ఈడబ్ల్యూఎస్ విభాగంలో 100 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ పరీక్షను 120 మార్కులకు నిర్వహిస్తారు. మొత్తం 120 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. 90 నిమిషాల సమయం ఉంటుంది. అప్లికేషన్ ను ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఫీజు రూ.750గా నిర్ణయించారు. రిజర్వ్‌డ్ కేటగిరిలకు చెందిన వారు రూ.150 చెల్లిస్తే చాలు. అభ్యర్థులకు 12 నెలల పాటు ట్రెయినింగ్ ఉంటుంది. ట్రెయినింగ్ సమయంలో మొదటి 9 నెలలు నెలకు రూ.2500 స్టయిపండ్ ఇస్తారు. తరువాత 3 నెలలకు నెలకు రూ.10వేలు స్టయిపండ్ ఇస్తారు. వేతనం రూ.48వేల నుంచి రూ.85వేల వరకు ఉంటుంది. ఇతర అలవెన్స్‌లను కూడా ఇస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు ఫిబ్రవరి 20ని చివరి తేదీగా నిర్ణయించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…