బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ బ్యాంకుకు చెందిన పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం518 పోస్టులకు గాను ఈ నియామక ప్రక్రియను చేపట్టనున్నారు. డిగ్రీ చదివిన వారు ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా మార్చి 11ను చివరి తేదీగా నిర్ణయించారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు https://www.bankofbaroda.in/ అనే అధికారిక సైట్‌ను సందర్శించవచ్చు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో 350 పోస్టులను భర్తీ చేస్తారు. బిజినెస్ అండ్ ఫారెక్స్‌లో 97, రిస్క్ మేనేజ్‌మెంట్ లో 35, సెక్యూరిటీలో 36 పోస్టులను భర్తీ చేస్తారు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ చదివి ఉండడంతోపాటు సంబంధిత విభాగంలో నైపుణ్యం ఉండాలి. ఐటీ, బిజినెస్, ఫైనాన్స్, రిస్క్ మేనేజ్‌మెంట్, సెక్యూరిటీ రంగాల్లో నైపుణ్యం లేదా పని అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యతను ఇస్తారు.
ఈ పోస్టులకు గాను అభ్యర్థులను ఆన్‌లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ అసెస్‌మెంట్, గ్రూప్ డిస్కషన్ లేదా పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు లేదా పూర్తి సమాచారం కోసం అధికారిక సైట్‌లో ఇచ్చిన లింకును సందర్శించవచ్చు.
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న…
ప్రముఖ టెక్ సంస్థ విప్రో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…