Intermittent Fasting : మనలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతూ ఉంటారు. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లే అధిక బరువు సమస్య బారిన పడడానికి ప్రధాన కారణాలని చెప్పవచ్చు. అలాగే అధిక బరువు వల్ల మనం వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన కూడా పడాల్సి వస్తుంది. గుండె జబ్బులు రావడానికి ప్రధాన కారణం అధిక బరువే అని చెప్పవచ్చు. కనుక అధిక బరువు సమస్య నుండి వీలైనంత త్వరగా బయటపడడం చాలా అవసరం. మనలో చాలా మంది బరువు తగ్గడానికి రకరకాల పద్దతులు పాటిస్తూ ఉంటారు. అయితే కొందరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికి బరువు తగ్గరు.
ఇలాంటి వారు ఇంటర్మీటెంట్ పాస్టింగ్ పద్దతిని పాటించడం వల్ల చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. ఈ పద్దతిలో రోజుకు రెండు సార్లు మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి. ఈ పద్దతిని మన పూర్వీకులు ఎప్పుడో పాటించారు. కష్టపడి పని చేసే వారు రోజుకు మూడు సార్లు ఆహారాన్ని తీసుకునే వారు. అదే నీడపట్టున కూర్చుని పని చేసే వారు రోజుకు రెండు సార్లు మాత్రమే ఆహారాన్ని తీసుకునే వారు. ఇలా తీసుకోవడం వల్లనే వారు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఎంతో కాలం జీవించారు. ఈ పద్దతినే మనం ఇప్పుడు ఆచరించాలి. ఈ ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ లో రోజుకు రెండు సార్లు ఆహారాన్ని తీసుకుని 16 గంటలు ఎటువంటి ఘన పదార్థాలను తీసుకోకుండా ఉండాలి.
ఉదయం 10 గంటలకు ఏదైనా ఒక వెజిటేబుల్ జ్యూస్ ను తీసుకోవాలి. ఇలా తీసుకున్న గంట తరువాత రెండు లేదా మూడు పుల్కాలను కూరలతో కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తరువాత మరలా సాయంత్రం 4 గంటలకు ఏదో ఒక ఫ్రూట్ జ్యూస్ ను తీసుకోవాలి. అలాగే 5 గంటలకు మొలకెత్తిన విత్తనాలను తీసుకోవాలి. తరువాత 7 గంటల లోపు వివిధ రకాల పండ్లను తీసుకోవాలి. మరింత శక్తి కావాలనుకునే వారు పచ్చి కొబ్బరిని, నానబెట్టిన పల్లీలను, డ్రై ఫ్రూట్స్ ను కూడా తీసుకోవచ్చు. సాయంత్రం 7 గంటల లోపు ఈ విధంగా ఆహారాన్ని తీసుకున్న తరువాత మరలా ఉదయం 11 గంటల వరకు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు.
ఈవిధంగా ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ ను పాటించడం వల్ల రెండు నెలల్లోనే మనం 5 నుండి 10 కిలోల వరకు బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ పద్దతిని పాటించడం వల్ల అధిక బరువు సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. ఆరోగ్యవంతంగా బరువు తగ్గవచ్చు. ఈ పద్దతిని పాటించడం వల్ల బరువు తగ్గడంతో పాటు శరీరానికి కావల్సిన పోషకాలు కూడా అందుతాయి. అలాగే షుగర్, థైరాయిడ్, ఆర్థరైటిస్ వంటి సమస్యలు అదుపులోకి వస్తాయి. అధిక బరువుతో బాధపడే వారు ఈ ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ పద్దతిని పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…