Diabetes : ప్రస్తుత కాలంలో మనలో చాలా మందిని వేధిస్తున్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల్లో షుగర్ వ్యాధి కూడా ఒకటి. షుగర్ వ్యాధితో మనలో చాలా మంది బాధపడుతున్నారు. ఈ వ్యాధి అదుపులో లేక చాలా మందిలో మూత్రపిండాలు వైఫల్యం చెందుతున్నాయి. కంటి చూపు తగ్గుతుంది. పురుషుల్లో లైంగిక సామర్థ్యం తగ్గుతుంది. అరిచేతులు, అరికాళ్లల్లో మంటలతో బాధపడుతున్నారు. దెబ్బలు, గాయాలు తగ్గక ఇబ్బంది పడుతున్నారు.శరీరంలో రక్షణ వ్యవస్థ సన్నగిల్లుతుంది. నీరసం, బలహీనత వంటి వాటితో బాధపడుతున్నారు. అలాగే దంతాల సమస్యలు, గుండె జబ్బులు వంటి వాటి బారిన పడుతున్నారు. చాప కింద నీరు వలె ఈ షుగర్ వ్యాధి శరీరనంతటిని నాశనం చేస్తుంది. కనుక ఈ వ్యాధిని అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం.
షుగర్ వ్యాధితో బాధపడే వారు ముచ్చటగా మూడు సూత్రాలను పాటించడం వల్ల చాలా సులభంగా ఈ వ్యాధి అదుపులోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. షుగర్ వ్యాధితో బాధపడే వారు ముందుగా తెల్లటి బియ్యంతో వండిన అన్నాన్ని తినడం మానేయాలి. బియ్యాన్ని పాలిష్ పట్టడం వల్ల పై రెండు పొరల్లో ఉండే పోషకాలన్నీ తవుడులోకి వెళ్లిపోతున్నాయి. మిగిలిన తెల్లబియ్యంలో కేవలం కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటాయి. అత్యధిక కార్బోహైడ్రేట్స్ ఉండే ధాన్యాల్లో బియ్యం ఒకటి. బియ్యంలో 77 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అన్నాన్ని ఎంత ఎక్కువగా తింటే షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి.
అలాగే అన్నాన్ని తినడం వల్ల షుగర్ వ్యాధి పెరుగుతుంది. కనుక షుగర్ వ్యాధి అదుపులోకి రావాలనుకునే వారు అన్నాన్ని తినడం మానేయాలి. పుల్కాలను, జొన్న రొట్టెలను మాత్రమే తినాలి. మధ్యాహ్నం పుల్కాలను, రాత్రి జొన్న రొట్టెలను ఎక్కువ కూరలతో ఆహారంగా తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మనం తీసుకునే కార్బోహైడ్రేట్ ల శాతం తగ్గుతుంది. అలాగే కూరల్లో ఉప్పు లేకుండా తీసుకోవాలి. ఉప్పు తక్కువగా తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి అదుపులోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే రెండవది… షుగర్ వ్యాధితో బాధపడే వారు ఉదయం పూట ఇడ్లీ, దోశ, ఉప్మా వంటి అల్పాహారాలను తీసుకోకూడదు. మొలకెత్తిన విత్తనాలను మాత్రమే తీసుకోవాలి. రోజూ ఉదయం 3 రకాల గింజలను మొలకెత్తించి తీసుకోవాలి.
అలాగే వీటితో పాటు పండ్లను తీసుకోవాలి. ఇక చివరిది రోజూ ఉదయం చెమట పట్టేలా వ్యాయామం చేయాలి. ఇలా చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. అలాగే రాత్రి భోజనం చేసిన తరువాత ఒక గంట పాటు వాకింగ్ చేయాలి. ఇలా మూడు నియమాలను పాటిస్తూ రోజుకు మూడు సార్లు మాత్రమే ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. ఈ విధంగా చేయడం వల్ల షుగర్ వ్యాధి తగ్గు ముఖం పడుతుంది. తరచూ రక్తపరీక్షలు చేయించుకుంటూ వైద్యున్ని సంప్రదించి మందుల మోతాదును తగ్గించుకుంటూ ఉండాలి. ఈ విధంగా షుగర్ వ్యాధితో బాధపడే వారు ఈ నియమాలను పాటించడం వల్ల చాలా సులభంగా షుగర్ వ్యాధిని తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…