Ganagapur Dattatreya Temple : సాధారణంగా లక్ష్మీ నరసింహస్వామి, కాళికా దేవి, దుర్గాదేవి, ఆంజనేయ స్వామి.. లాంటి దేవతలు, దేవుళ్లు దుష్ట శక్తులను సంహరించేవారుగా పూజలందుకుంటూ ఉంటారు. వారి ఆలయాలను దర్శిస్తే శరీరంపై ఏవైనా గాలి ఉంటే పోతుందని.. దుష్ట శక్తుల పీడ వదులుతుందని నమ్ముతారు. అయితే వీరే కాదు.. ఇలాంటి ప్రత్యేకత ఉన్న ఆలయం ఒకటుంది. అదే.. శ్రీగురు దత్తాత్రేయ క్షేత్రం. ఈ ఆలయం కర్ణాటక రాష్ట్రంలో ఉంది. దీని ప్రత్యేకతలు, విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లా అఫ్జల్‌పూర్ తాలూకా భూమా నది ఒడ్డున గనాగపూర్ అనే ప్రాంతంలో శ్రీగురు దత్తాత్రేయ స్వామి ఆలయం ఉంది. ఇక్కడ స్వామికి చెందిన పాదుకలను దర్శించుకుంటారు. ఇక్కడ ప్రవహించే భీమా, అమరాజా అనే నదుల సంగమం చాలా పవిత్రమైందిగా భావిస్తారు. ఇందులో స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. ఈ ఆలయానికి చాలా మంది దుష్టశక్తులను వదిలించుకునేందుకు వస్తుంటారు. ఇక్కడికి వస్తే దెయ్యాలను వదిలించుకోవచ్చని నమ్ముతారు. కొందరు ఈ ఆలయంలోకి రాగానే వింతగా ప్రవర్తిస్తారు. ఏవైనా దుష్ట శక్తులు, గాలి ఉంటే ఈ ఆలయానికి వస్తే పోతాయని చెబుతారు.
ఇక ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. ఇక్కడ చుట్టు పక్కల అనేక దర్శనీయ స్థలాలు కూడా ఉన్నాయి. ఇక్కడి భీమా, అమరాజా నదుల సంగమం వద్ద సంగమేశ్వర ఆలయం ఉంది. దీన్ని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటారు. సంగమంలో స్నానం ఆచరించి దైవాన్ని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. అలాగే ఇక్కడికి సమీపంలో అష్ట తీర్థాలు ఉన్నాయి. ఇక్కడ కూడా భక్తులు తమ పాపాలను పోగొట్టుకుంటానికి స్నానాలు ఆచరిస్తుంటారు.
ఇక గనాగపూర్‌కు హైదరాబాద్ నుంచి వెళ్లాలంటే గుల్బర్గా వరకు ముందుగా వెళ్లాల్సి ఉంటుంది. గుల్బర్గాకు 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది. కేఎస్‌ఆర్‌టీసీ, టీఎస్‌ఆర్‌టీసీ బస్సులను నడుపుతున్నారు. గుల్బర్గా చేరుకున్నాక అక్కడి నుంచి గనాగపూర్‌కు వెళ్లాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి గుల్బర్గాకు రైలు మార్గంలోనూ వెళ్లవచ్చు. బెంగళూరు చేరుకుని అక్కడి నుంచి కూడా గనాగపూర్‌కు వెళ్లవచ్చు. ఇక ఈ ఆలయంలో నిత్యం అనేక పూజలు, అభిషేకాలు జరుగుతుంటాయి. ప్రత్యేక సేవలను కూడా నిర్వహిస్తుంటారు. కనుక సేవ వివరాలను తెలుసుకుని వెళితే స్వామి వారిని సులభంగా దర్శించుకోవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…