Drinking Water : అధిక బరువు.. నేటి తరుణంలో అధిక శాతం మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఇది. కారణాలు ఏమున్నా ప్రస్తుతం చాలా మంది స్థూలకాయులుగా మారిపోతున్నారు. ఈ క్రమంలో అలా పెరిగిన బరువును తగ్గించేందుకు నానా తంటాలు పడుతున్నారు. కొందరు మందులు మింగడం, ఎక్సర్‌సైజులు చేయడం చేస్తుంటే ఇంకొందరు యోగా, ప్రాణాయామం వంటి వాటిని అవలంబిస్తున్నారు. అయితే మీకు తెలుసా..? నీటి వల్లే మనం అధిక శాతం బరువు తగ్గవచ్చని. అవును, మీరు విన్నది నిజమే. కింద సూచించిన విధంగా నీటిని తాగితే కేవలం 10 రోజుల్లోనే 5 కిలోల బరువు తగ్గుతారట. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
టీ, కాఫీ తాగేముందు ఒక గ్లాస్ నీటిని తాగండి. ఇది కడుపులో ఏర్పడే అసిడిటీ, గ్యాస్ సమస్యలను తగ్గించడమే కాదు, అధిక బరువును కూడా తగ్గిస్తుంది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి ముందు గానీ, బ్రేక్‌ఫాస్ట్ చేసిన తరువాత గానీ ఒక గ్లాస్ నీరు తాగాలి. అయితే కనీసం 30 నిమిషాల ముందు లేదా తరువాత ఇలా చేయాలి. అలాగే మధ్యాహ్నం, రాత్రి భోజనం చేయడానికి అరగంట ముందు ఒక గ్లాస్ నీటిని తాగాలి. దీంతో ఆకలి తగ్గుతుంది. తద్వారా కడుపు నిండిన భావన కలిగి భోజనం కూడా తక్కువగా తింటాం.
రాత్రి నిద్రించడానికి గంట ముందు ఒక గ్లాస్ నీటిని తాగాలి. అది అర్థరాత్రి సమయంలో కలిగే ఆకలిని నియంత్రిస్తుంది. పైన చెప్పిన సమయాల్లో కాకుండా రోజు మొత్తంగా వివిధ సమయాల్లో 9 నుంచి 10 గ్లాసుల నీటిని తాగాలి. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. దీంతోపాటు అధిక బరువును కూడా తగ్గిస్తుంది. సోడా, జ్యూస్ వంటివి తాగాల్సి వచ్చినప్పుడు వాటికి బదులుగా ఒక్కో గ్లాస్ నీటిని తాగండి. దీంతో శరీరంలో అదనపు షుగర్స్ చేరవు. బరువు కూడా తగ్గుతారు.
బ్రేక్‌ఫాస్ట్, లంచ్ చేసినా గానీ ఆకలిగా ఉంటే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక నిమ్మకాయను పూర్తిగా పిండి ఆ మిశ్రమాన్ని తాగండి. దీంతో ఆకలి తగ్గుతుంది. మళ్లీ ఆకలి వేయదు. బరువు కూడా తగ్గవచ్చు. పైన చెప్పిన విధంగా నీటిని రోజూ తాగుతూ, సరైన వేళకు భోజనం చేస్తూ, వ్యాయామం చేస్తుంటే అతి తక్కువ వ్యవధిలోనే సులభంగా అధిక బరువును తగ్గించుకోవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…