ముఖ్య‌మైన‌వి

Acharya Chanakya : ఆచార్య చాణ‌క్యుడు చెప్పిన నీతి.. ఇలాంటి వారికి ఎల్ల‌ప్పుడూ దూరంగా ఉండాలి..!

Acharya Chanakya : మ‌నుషులంద‌రి స్వ‌భావం ఒకే విధంగా ఉండ‌దు. కొంద‌రు ఎప్పుడూ న‌వ్వుతూ, న‌వ్విస్తూ ఉంటే మ‌రికొంద‌రు ఏదో పోగొట్టుకున్న‌ట్టు ఆత్మ‌న్యూన‌త‌తో బాధ‌ప‌డుతుంటారు. ఇంకా కొంద‌రు అటూ ఇటూ కాకుండా ఒక‌సారి న‌వ్వుతూ, మ‌రోసారి సీరియ‌స్ లుక్‌తో ఉంటారు. అయితే ఎవ‌రెలా ఉన్నా ఏం బాధ లేదు. కానీ కొన్ని విల‌క్ష‌మైన వ్య‌క్తిత్వాలు, మ‌న‌స్త‌త్వం క‌లిగిన వ్య‌క్తుల‌తో ఎప్ప‌టికీ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ట‌. అవ‌స‌ర‌మైతే వారి నుంచి వీలైనంత దూరంగా వెళ్లాల‌ట‌. లేదంటే వారి వ‌ల్ల మ‌న‌కు ఎప్ప‌టికీ క‌ష్టాలే వ‌స్తాయ‌ట‌. అంతేకాదు అలాంటి వ్య‌క్తుల ద‌గ్గ‌ర ఉండ‌డం వ‌ల్ల‌ మ‌న జీవితంలో ఉన్న సంతోషం కూడా పోతుంద‌ట‌. ఈ విష‌యాల‌ను ఆచార్య చాణ‌క్యుడు చెప్పాడు. మ‌రి ఎలాంటి వ్య‌క్తుల‌కు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందామా.

ఇత‌రుల క‌ష్టాల‌ను చూసి ఆనందించేవారు.. ఇలాంటి స్వ‌భావం క‌లిగిన వ్య‌క్తుల నుంచి వీలైనంత దూరంగా ఉండ‌డ‌మే బెట‌ర్‌. ఎందుకంటే ఇలాంటి వారు ఇత‌రులు బాధ‌ప‌డుతుంటే లోలోప‌ల ఆనందిస్తారు. కొన్ని సార్లు పైకే హ్యాపీగా క‌న‌బ‌డతారు. వీరిలోనే ఇంకో టైప్ ఎలా ఉంటారంటే ఇత‌రుల‌కు ఎప్ప‌టికీ క‌ష్టాలు, న‌ష్టాలు క‌లిగిస్తూ వాటితో ఇత‌రులు బాధ‌ప‌డుతుంటే తాము ఆనందిస్తారు. కాబ‌ట్టి ఇలాంటి వారి నుంచి వీలైనంత వ‌ర‌కు దూరంగానే ఉండాలి.

Acharya Chanakya

ఈగో ఎక్కువ‌గా ఉన్న‌వారు.. ఇలాంటి వారు మ‌న‌కు ఎలాంటి హాని క‌లిగించ‌కున్నా వారి వ‌ల్ల మ‌న‌కు ఒక్కోసారి న‌ష్టం క‌లిగే అవ‌కాశ‌మే ఎక్కువ‌గా ఉంటుంది. వీరు మ‌న ప్ర‌గ‌తిని, ఉన్న‌తిని చూసి ఓర్వ‌లేరు. ఆ క్ర‌మంలో మ‌న‌కు ఏదైనా న‌ష్టం త‌లపెట్ట‌వ‌చ్చు. ఇలాంటి వారు ఎక్కువ‌గా తాము చేసే త‌ప్పుల‌ను అంత సుల‌భంగా అంగీక‌రించ‌రు. వీరి నుంచి కూడా దూరంగానే ఉండాలి. మోసం చేసే వారు.. మోసం చేసే వారు ఎల్ల‌ప్పుడూ త‌మ స్వార్థం కోస‌మే ప‌నిచేస్తారు. దాన్నే చూసుకుంటారు. అంతే త‌ప్ప వారు ఇత‌రుల‌తో ఎప్ప‌టికీ క‌లిసి ఉండ‌లేరు. ఈ క్ర‌మంలో అలాంటి వారు కొన్ని సంద‌ర్భాల్లో మ‌న‌కు హాని క‌లిగిస్తారు. కాబ‌ట్టి ఇలాంటి వారి నుంచి కూడా దూరంగానే ఉండాలి. న‌మ్మి మోస‌పోకూడ‌దు.

స్త్రీ లోలురు.. ఎల్ల‌ప్పుడూ స్త్రీల వెంట తిరిగే వారు, స్త్రీ లోలుర నుంచి కూడా దూరంగానే ఉండాలి. వారితో ఎప్ప‌టికైనా ప్ర‌మాద‌మే. అలాంటి వారికి మ‌హిళ‌లు త‌న‌, ప‌రాయి అనే భేదం ఉండ‌దు. దీంతో వారు హాని కూడా క‌లిగించ‌వ‌చ్చు. క‌నుక వీరికి దూరంగానే ఉండాలి. అత్యాశ‌, స్వార్థ ప‌రులు.. అతిగా ఆశ ప‌డే వారు, స్వార్థ ప‌రుల నుంచి దూరంగా ఉండాలి. వారు మ‌న‌కు ఎప్ప‌టికైనా న‌ష్టం క‌లిగిస్తారు. ఇలాంటి వారు ఇత‌రుల న‌మ్మ‌కాల‌ను, ప‌ట్టుద‌ల‌ను, ఆత్మ‌విశ్వాసాన్ని పూర్తిగా త‌గ్గిస్తారు. ఇత‌రులు సంతోష ప‌డితే వీరు చూడ‌లేరు. క‌నుక వీరిని కూడా దూరం పెట్టాల్సిందే. ఇత‌రుల‌ను చూసి అసూయ ప‌డేవారు.. ఇత‌రుల‌ను చూసి ఎక్కువ‌గా ఈర్ష్య‌, అసూయ‌ల‌కు లోన‌య్యే వారి నుంచి కూడా మ‌నం దూరంగానే ఉండాలి. వారితోనూ ఎప్ప‌టికీ ప్ర‌మాదాలే పొంచి ఉంటాయి. వారు ఒక‌రి ఉన్న‌తిని చూసి ఓర్వ‌లేరు. క‌నుక వీరంద‌రికీ మ‌నం ఎల్ల‌ప్పుడూ దూరంగా ఉండాలి. లేదంటే ఇబ్బందుల‌ను కొని తెచ్చుకున్న‌వార‌మవుతాము.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM