ఓ ప్రియుడు తన ప్రియురాలిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని.. ఆమె కుటుంబాన్ని బెదిరించి తమ పెళ్లికి వారిని ఒప్పించాలని.. తాను సూసైడ్ చేసుకున్నట్లు ఓ కట్టుకథ అల్లాడు. అయితే అతను చేసిన పనికి తీవ్ర మనస్థాపం చెందిన ప్రియురాలు నిజంగానే ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
కర్ణాటకకు చెందిన సక్కమ, అరుణ్‌లు ఎంతో కాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే ఇద్దరూ తమ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ సక్కమ కుటుంబ సభ్యులు ఆ పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో అరుణ్ ఎలాగైనా ఆమెను పెళ్లి చేసుకోవాలని చెప్పి తన ఫ్రెండ్ గోపాల్‌తో కలిసి ఓ కట్టుకథ అల్లాడు. తాను సూసైడ్ చేసుకునేందుకు యత్నించానని హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నానని ఓ కథ సృష్టించాడు.
ఈ క్రమంలోనే అరుణ్ పథకం ప్రకారం గోపాల్ తాను పోలీస్ అని చెప్పి సక్కమ కుటుంబ సభ్యులను కలిశాడు. వెంటనే అరుణ్, సక్కమ ల పెళ్లి ఫిక్స్ చేయాలని.. లేదంటే అరుణ్ ఆత్మహత్య యత్నానికి మీరే కారణమని కేస్ పెడతానని.. గోపాల్ హెచ్చరించాడు.
అయితే ఈ విషయం తెలుసుకున్న సక్కమ తీవ్ర మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా.. అసలు విషయం బయట పడింది. అరుణ్ ఆత్మహత్యా యత్నం చేయలేదని, తన ఫ్రెండ్ గోపాల్‌తో కలిసి కట్టుకథ అల్లాడని తెలుసుకున్నారు. ఇక పోలీస్ అని చెప్పి సక్కమ కుటుంబ సభ్యులను బెదిరించినందుకు గాను గోపాల్ ను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…