Bahubali 3 : దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పెంచిన విషయం తెలిసిందే. రెండు పార్ట్‌లుగా విడుదలైన ఈ చిత్రం రికార్డులని చెరిపేసింది. ఈ సినిమాకు మూడో పార్ట్ ఉంటుందా అని కొద్ది రోజులుగా అభిమానులలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఆయన ఆర్ఆర్ఆర్ కి సంబంధించిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. రాజమౌళి వివరణతో అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది.
ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ లో రాజమౌళికి అనేక రకాల ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఆయన భవిష్యత్తు ప్రాజెక్టులు ఎలా ఉండబోతున్నాయని విలేకరులు ఎన్నో సందేహాలను అడుగుతున్నారు. ఇక తన తదుపరి ప్రాజెక్టు అయితే తప్పకుండా మహేష్ బాబు తోనే ఉంటుందని, అది కూడా ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ అని చాలా క్లియర్ గా రాజమౌళి వివరణ ఇస్తూ వస్తున్నారు.
బాహుబలి 3 గురించి అడిగిన ప్రశ్నకు ఇప్పుడు కాకపోయినా.. భవిష్యత్తులో బాహుబలి 3 తప్పక ప్లాన్ చేస్తానని రాజమౌళి ప్రకటించారు. అయితే ఎప్పుడు వస్తుందనే విషయంపై ఇప్పుడే చెప్పలేనని అన్నారు. గతంలో ఈగ సీక్వెల్ కూడా ఉంటుందని తెలియజేశారు. మొత్తానికి రాజమౌళి నోటి నుండి బాహుబలి 3 రూపొందనుందనే వార్త బయటకు రావడంతో అభిమానుల్లో ఆనందం అవధులు దాటుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…