క్రైమ్‌

సంచ‌ల‌న తీర్పు ఇచ్చిన సంగారెడ్డి జిల్లా కోర్టు.. ఐదేళ్ల బాలిక హ‌త్యాచారం కేసులో దోషికి ఉరిశిక్ష‌..

ప్ర‌భుత్వాలు ఎన్ని క‌ఠిన శిక్షలు విధిస్తున్నా కూడా ప్ర‌జ‌ల‌లో మార్పు రావ‌డం లేదు. చిన్న చిన్న పిల్ల‌లపై కూడా హ‌త్యాచారాలు చేస్తూ సభ్య‌స‌మాజం సిగ్గుప‌డేలా చేస్తున్నారు. తాజాగా ఐదేళ్ల బాలికపై హత్యాచారం కేసులో సంగారెడ్డి జిల్లాలోని పోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో ముద్దాయిగా ఉన్న 56 సంవత్సరాల బీహార్ వలస కార్మికుడికి ఉరిశిక్ష విధించింది. ఈ మేరకు గురువారం తీర్పుని వెలువరించింది. చిన్నారి తల్లితండ్రులకు ప్రభుత్వం 10 లక్షల రూపాయలను పరిహారంగా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటన జరిగిన 11 నెలలలోపే తీర్పు వచ్చింది. సంగారెడ్డి కోర్టు పరిధిలో ఉరిశిక్ష విధించడం 27 సంవత్సరాల తర్వాత… ఇదే మొదటిసారి.

బీహార్ రాష్ట్రానికి చెందిన గఫార్ అలీ(56) గత సంవత్సరం బీడీఎల్ బానూరులో ఐదేళ్ల బాలికకు కూల్ డ్రింక్స్‌లో మద్యం కలిపి తాగించి.. అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబుతుందనే అనుమానంతో హత్య చేశాడు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ఆ తర్వాత దర్యాప్తు చేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు.నిందితుడిపై నేరాభియోగానికి సంబంధించి ప్రాసిక్యూషన్ తగిన సాక్ష్యాధారాలను చూపించడంతో గఫార్‌కు మరణ దండన విధిస్తూ సంగారెడ్డి జిల్లా కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. కాగా, ఈ ఘటన జరిగి 11 నెలలు అవుతోంది. తక్కువ సమయంలోనే దోషికి ఉరిశిక్ష పడటంతో బాలిక తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. కాగా, సంగారెడ్డి జిల్లాలో 27 ఏళ్ల తర్వాత మరణశిక్ష విధించారు.

కేసు వివ‌రాల‌లోకి వెళితే..బీడీఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. చైతన్య కంపెనీ లో పనిచేసే దంపతుల ఐదేళ్ల కుమార్తెను సెక్యూరిటీ గార్డ్ వద్ద ఉంచి వారు పనికి వెళ్లారు. వీరి రూమ్ ప్రక్క రూంలో ఉండే నేరస్తుడు గఫాఫర్ అలీ అక్టోబర్ 16, 2023 నాడు పనికి వెళ్ళకుండా మద్యం సేవించి ఉన్నాడు. సుమారు ఉదయం 11 గంటల సమయంలో సెక్యూరిటీ గార్డ్ వద్ద పాప కనిపించగా పాప తెలుసని చెప్పి తీసుకెళ్లాడు.చిన్నారికి మద్యం కలిపిన కూల్ డ్రింక్ తాగించి పత్తి చేనులోకి తీసుకెళ్లాడు. అత్యాచారం చేసి ఆపై హత్య చేశాడు. బాలిక కోసం సాయంత్రం అంతటా వెతికిన తల్లితండ్రులు… చివరికి చిన్నారి శవాన్ని పత్తి చేనులో గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసు పూర్వపరాలను విన్న స్పెషల్ పోక్సో జడ్జి జయంతి… నిందితునికి మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.

Share
Sunny

Recent Posts

ఈ ఫుడ్ తింటే ఊపిరితిత్తులు నెల రోజుల్లో పూర్తి ఆరోగ్యంగా మారుతాయి..!

మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్య‌మైన‌వో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…

Monday, 23 September 2024, 5:22 PM

రోడ్డుపై కుక్క‌లు మిమ్మ‌ల్ని వెంబ‌డిస్తే ఆ స‌మ‌యంలో ఏం చేయాలి అంటే..?

ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మ‌రింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…

Saturday, 21 September 2024, 3:01 PM

క‌లెక్ష‌న్ల‌లో దుమ్ము రేపుతున్న స్త్రీ 2 మూవీ.. బాలీవుడ్ లో ఆల్‌టైమ్ హై రికార్డు..!

సాహో చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న కథానాయిక‌గా న‌టించి అల‌రించిన శ్ర‌ద్ధా క‌పూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో ప‌ల‌క‌రించింది. 2018లో…

Saturday, 21 September 2024, 5:47 AM

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM