సాధారణంగా మూవీలలో మనం స్పైడర్ మ్యాన్ ని చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు ఎంతో ఎత్తుకు పాకుతూ వెళ్తాడు. అచ్చం నిజ జీవితంలో కూడా ఓ చిన్నారి స్పైడర్ మాన్ ను తలపించేలా గోడలను పాకుతూ క్షణాల్లో ఇంటిపైకప్పుకు చేరుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియోలో ఐదు సంవత్సరాల చిన్నారి రెండు గోడల మధ్య నిలబడి ఎంతో సునాయాసంగా గోడలపై పాకుతూ ఇంటి పై కప్పుకు చేరుకుంది. ఇంటి పై కప్పు వరకు చేరుకున్న చిన్నారి అక్కడ కాసేపు కొన్ని అద్భుతమైన విన్యాసాలను ప్రదర్శించి కాళ్లు చేతులతో ఎంతో భిన్నమైన ఫీట్లు చేస్తూ తిరిగి కిందికి వచ్చింది.
అయితే ఈ వీడియోలో చిన్నారి తన కాళ్ళు, చేతులను గోడకు వ్యతిరేకంగా పెట్టుకొని పాకుతూ వెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు ఈ చిన్నారి టాలెంట్ ను చూసి మురిసిపోతున్నారు. ఈ క్రమంలోనే కొందరు చిన్నారిపై ప్రశంసలు కురిపిస్తూ కామెంట్లు చేయగా మరికొందరు ఏ అర్ధరాత్రి సమయంలోనైనా ఇలా చేస్తే ఇక జీవితాంతం నేను మందులు వాడాల్సిందే.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…