సాధారణంగా చాలామంది ప్రేమ వివాహాలు చేసుకొని ఎంతో సుఖంగా, సంతోషంగా జీవితంలో ముందుకు సాగి పోతూ ఉంటారు. అయితే కొందరి జీవితాలలో మాత్రం ఎన్నో సమస్యలు, కష్టాలు వస్తుంటాయి. ఆదిలాబాద్ కి చెందిన రాహుల్ గౌడ్, మౌనిక అనే యువతీయువకులు ప్రేమించుకుని గత రెండు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇలా ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్న సమయంలో వీరిద్దరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి.
కాగా ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో మౌనిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన భర్త రాహుల్ గౌడ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే పోలీసులు రాహుల్ గౌడ్ ను స్టేషన్ కి పిలిపించి అతని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. దీంతో పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళిన రాహుల్ గౌడ్ ఎంతో మనస్థాపానికి గురయ్యాడు.
ఈ క్రమంలోనే మనస్థాపానికి గురైన రాహుల్ గౌడ్ శనివారం ఉదయం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఈ విషయం గమనించిన వన్ టౌన్ మహిళా పోలీస్ స్టేషన్ సీఐ రాహుల్ ను తన వాహనంలో తీసుకుని చికిత్స నిమిత్తం రిమ్స్ కి తరలించారు. కాగా చికిత్స పొందుతూ రాహుల్ మృతి చెందడంతో అతని బంధువుల ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…