అగ్ని పర్వతాలు అంటే ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. వాటి నుంచి భగ భగ మండే లావా వెలువడుతుంది. ఈ క్రమంలో అక్కడ వందల డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఉంటాయి. అలాంటి వాతావరణంలో ఎవరూ ఉండలేరు. కానీ ఓ వ్యక్తి మాత్రం అలాంటి వాతావరణంలో పిజ్జాలను తయారు చేస్తున్నాడు.
గ్వాటెమాలాలోని పకాయా అనే అగ్విపర్వతాన్ని అక్కడి 34 ఏళ్ల డేవిడ్ గార్షియా అనే వ్యక్తి కిచెన్‌గా చేసుకున్నాడు. అక్కడికి సమీపంలో క్యాంపును ఏర్పాటు చేసి పిజ్జాకు కావల్సిన అన్ని పదార్థాలను తయారు చేసుకుని అనంతరం పిజ్జా ట్రేను తీసుకుని అగ్ని పర్వతం మీద పెట్టి వస్తాడు. 14 నిమిషాల తరువాత వెళ్లి పిజ్జాను తీసుకువస్తాడు. అక్కడ సుమారుగా 800 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. దీంతో పిజ్జా పర్‌ఫెక్ట్ గా తయారవుతుంది.
VIDEO: ???? In an improvised kitchen among volcanic rocks, David Garcia stretches his dough and selects ingredients for a #pizza destined for a rather unusual oven: a river of lava that flows from the Pacaya #volcano in Guatemala pic.twitter.com/wVmnnl61Ib
— AFP News Agency (@AFP) May 12, 2021
అలా డేవిడ్ తాను అగ్ని పర్వతంపై తయారు చేసిన పిజ్జాలను విక్రయిస్తున్నాడు. దీంతో అక్కడికి టూరిస్టులు కూడా బాగానే వచ్చి పిజ్జాలను రుచి చూస్తున్నారు. వాటికి ఆ అగ్నిపర్వతం పేరిటే పకాయా పిజ్జాలు అని నామకరణం చేశాడు. అయితే అంతటి ఉష్ణోగ్రతలో డేవిడ్ ఎలా వెళ్లగలుగుతున్నాడు ? అనేదే కదా మీ సందేహం. ఏమీ లేదు, అతను పిజ్జా ట్రేను పెట్టేందుకు వెళ్లేటప్పుడు, పిజ్జా తయారయ్యాక దాన్ని తెచ్చేందుకు వెళ్లేటప్పుడు ప్రొటెక్షన్ గేర్‌ను ధరిస్తాడు. ఆ సామగ్రి 1800 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలను కూడా తట్టుకోలదు. కనుకనే అతను అగ్నిపర్వతం మీదకు వెళ్లగలుగుతున్నాడు. ఇక అతని వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా మంది అతను పిజ్జా తయారు చేస్తున్న విధానం చూసి షాకవుతున్నారు.