లెజెండరీ డైరెక్టర్ బోయపాటి శ్రీను నందమూరి నటసింహం బాలకృష్ణ కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న అఖండ సినిమా గురించి ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన లెజెండ్, సింహం ఎంతటి ఘన విజయాన్ని అందుకున్నాయో మనకు తెలిసిందే. ఈ తరహాలోనే అఖండ సినిమాను కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
అఖండ సినిమాలో త్రిపాత్రాభినయంలో బాలకృష్ణ సందడి చేయనున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ మొట్టమొదటిసారిగా అఘోర పాత్రలో కనిపించనున్నారు. ఇకపోతే ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా సందడి చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమాలో పూర్ణ ఎంతో కీలకమైన పాత్రలో కనిపించనున్నారని సమాచారం వినపడుతోంది.
అఖండ సినిమాలో పూర్ణ పాత్ర నిడివి చాలా తక్కువగా ఉన్నప్పటికీ, బాలయ్య భార్య పాత్రలో పూర్ణ కనిపించనుందనే సమాచారం వినబడుతుంది.ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో కనిపించే పూర్ణ చిత్రంలో కీలక మలుపు తిప్పే క్యారెక్టర్ చేస్తోందట. ఈ సినిమా ఆమె కెరియర్ లో బాగా ప్లస్ కావొక్కనే టాక్ నడుస్తోంది.