దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు పోస్టుల భర్తీకి గాను దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడాలో మొత్తం 4500 అప్రెంటిస్, ఎస్‌వో పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్‌ను రిలీజ్ చేశారు. 20 నుంచి 28 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, మాతృభాషలో ప్రావీణ్యత, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు ఏదైనా డిగ్రీ చదివి ఉండాలి. వయస్సు 20 నంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపులు ఇచ్చారు. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా మార్చి 11వ తేదీ వరకు గడువుగా నిర్ణయించారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు అభ్యర్థులు రూ.800 అప్లికేషన్ ఫీజు చెల్లించాఇ. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు రూ.600 చెల్లించాలి. పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.400 చెల్లిస్తే చాలు.
పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.15000 స్టయిపెండ్‌గా చెల్లిస్తారు. ఇతర అలవెన్స్‌లు కూడా ఉంటాయి. అదే స్పెషలిస్ట్ ఆఫీసర్ (ఎస్‌వో) పోస్టులకు నెలకు రూ.64,400 చెల్లిస్తారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు https://nats.education.gov.in/ అనే సైట్ లేదా http://www.bankofbaroda.in/Career.htm అనే సైట్‌ను సందర్శించవచ్చు.