రుతు పవనాలు, అల్పపీడనాలు, ద్రోణుల కారణంగా దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. అనేక చోట్ల వర్షాలు పెను విధ్వంసాలను సృష్టిస్తున్నాయి. నిన్న కాక మొన్న యూపీ, రాజస్థాన్‌లలో పిడుగులు పడి ఏకంగా 87 మంది మృతి చెందారు. ఇక తాజాగా గుజరాత్‌లోనూ భారీ వర్షాలు కురుస్తూ పిడుగులు పడుతున్నాయి.
మంగళవారం మధ్యాహ్నం గుజరాత్‌లోని దేవభూమి ద్వారక జిల్లాలో ఉన్న ద్వారకాధీష్ ఆలయంపై పిడుగులు పడ్డాయి. దీంతో ఆలయ గోపురంపై ఉన్న జెండా దెబ్బ తిన్నది. పిడుగు నేరుగా ఆ జెండా మీదే పడింది. అయితే ఆ పిడుగు వల్ల ఆలయానికి ఎలాంటి నష్టం జరగలేదు. ఆ సమయంలో ఆలయంలో, చుట్టు పక్కల కొందరు భక్తులు ఉన్నారు. కానీ ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు.
Jagat Mandir of Lord Dwarkadheesh witnessed a long spell of lightning with thunder showers. No damage or loss except the flag getting torn. Lord Dwarkadheesh is always a saviour. Jay Dwarkadheesh!#Dwarka #Gujarat #Rains #Monsoon #Lightningstrikes pic.twitter.com/VA65y9pXae
— Parimal Nathwani (@mpparimal) July 13, 2021
ఇక అదే సమయంలో వీడియో తీసి దాన్ని కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ క్రమంలో ఆలయంపై పిడుగు పడిన ఆ వీడియో వైరల్‌గా మారింది. చూస్తుంటేనే చాలా భయంగా అనిపిస్తోంది. ఈ సందర్భంగా ఆ జిల్లా పాలక విభాగం అధికారులతో కేంద్ర మంత్రి అమిత్ షా ఫోన్లో మాట్లాడారు. పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రాణ నష్టం ఏమీ జరగలేదని అధికారులు మంత్రికి చెప్పారు.