జేఈఈ మెయిన్స్ 2021 అడ్మిట్ కార్డుల విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్‌కు చెందిన 3వ సెషన్‌కు అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్‌సైట్లలో (nta.ac.in, jeemain.nta.nic.in) విడుదల చేశారు. అభ్యర్థులు ముందు పేర్కొన్న వెబ్‌సైట్‌లను సందర్శించి వారి జేఈఈ మెయిన్స్ అడ్మిట్ కార్డు 2021 లను డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
జేఈఈ మెయిన్స్ 2021 కు చెందిన 3వ సెషన్ కోసం దాదాపుగా 7 లక్షల మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష జూలై 20 నుండి 25 వరకు జరుగుతుంది. ఇది ఏప్రిల్‌లో జరగాల్సి ఉండగా వాయిదా పడింది. ఈ క్రమంలోనే ముందు చెప్పిన తేదీల్లో పరీక్షను నిర్వహించనున్నారు.
JEE మెయిన్స్ 2021 అడ్మిట్ కార్డ్ ను డౌన్‌లోడ్ చేయడానికి ఈ స్టెప్స్‌ను అనుసరించండి.
స్టెప్ 1: అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in ని సందర్శించాలి.
స్టెప్ 2: హోమ్‌పేజీలో అడ్మిట్ కార్డ్ లింక్‌పై క్లిక్ చేయాలి.
స్టెప్ 3: మీ వివరాలను ఉపయోగించి లాగిన్ అవ్వండి.
స్టెప్ 4: జేఈఈ మెయిన్స్ 2021 అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేయండి.
స్టెప్ 5: భవిష్యత్ రిఫరెన్స్ కోసం జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డుకు చెందిన ప్రింటౌట్ ను తీసుకోండి.
విద్యార్థులు తమ జేఈఈ మెయిన్స్ 2021 అడ్మిట్ కార్డులను పరీక్ష హాళ్ళకు తీసుకెళ్లవలసి ఉంటుంది. ఎందుకంటే ఇది ధృవీకరణ కింద పనిచేస్తుంది. ఇక విద్యార్థులు తమ తమ జీఈఈ మెయిన్స్ 2021 అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేయలేకపోతే వారు 011-40759000 అనే నంబర్‌కు కాల్ చేయవచ్చు. లేదా ఇ-మెయిల్ ద్వారా jeemain@nta.ac.in కు మెయిల్ చేయవచ్చు.
అన్ని పరీక్షా కేంద్రాల్లో కోవిడ్ -19 మార్గదర్శకాలను అనుసరించే కఠినమైన ప్రోటోకాల్ మధ్య జేఈఈ మెయిన్స్ 2021 పరీక్షను నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్స్ 2021 ప్రవేశ పరీక్షను రాసే అభ్యర్థులకు ఫేస్ మాస్క్‌లను అందిస్తారు. పరీక్షకు ముందు అన్ని కంప్యూటర్లు, సీట్లు శుభ్రపరచబడతాయి. జేఈఈ మెయిన్స్ 2021 ప్రవేశ పరీక్షా కేంద్రాల్లో రద్దీని నివారించడానికి అభ్యర్థులను నిర్దిష్టమైన సమయాల్లో కేటాయించిన టైమ్ స్లాట్ల ప్రకారం లోపలికి అనుమతిస్తారు.