సాధారణంగా వివాహం అంటే ఎంతో సాంప్రదాయబద్దంగా నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే వివాహ వేడుకలో వధూవరులు ఎన్నో పూజా కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తుంది. ఈ విధంగా పెళ్లిలో ఎంతో బిజీగా ఉండటం వల్ల వధూవరులకు కాస్త నిద్ర కూడా కరువవుతుందని చెప్పవచ్చు. ఇలా ఓ వరుడికి నిజంగానే నిద్ర చాలలేదేమో పాపం.. ఏకంగా వివాహ రిసెప్షన్ లోనే నిద్రపోతూ కెమెరాకు దొరికాడు.
ఈ విధంగా పెళ్లి కార్యక్రమంలో భాగంగా నిర్వహించే వివాహ రిసెప్షన్ లో వధువు పక్కన ఉండగానే వరుడు నిద్రలోకి జారుకున్నాడు.ఈ విధంగా వేదికపైనే నిద్రపోతున్న వరుడిని చూసిన బంధువులు ఆ వరుడిని లేపడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ తాను నిద్ర నుంచి బయటకు లేవలేదు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
https://www.instagram.com/reel/CQEK1dkFMji/?utm_source=ig_web_copy_link
ఈ వీడియో చూసిన నెటిజన్లు అందరూ తమదైన శైలిలో వరుడు పై కామెంట్ ల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో వివాహ వేడుకలలో ఇలాంటి వింత సంఘటనలు చోటు చేసుకుంటూ తరుచు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో పై మీరు ఓ లుక్కేయండి.