ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు తన యూజర్లకు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది. అందులో భాగంగానే తాజాగా మరొక ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. వాట్సాప్ యూజర్లు ఇప్పటి వరకు ఒక అకౌంట్‌ను కేవలం ఒక డివైస్‌లో మాత్రమే వాడుకునే సదుపాయం ఉండేది. కానీ ఇకపై ఒక అకౌంట్‌ను నాలుగు డివైస్‌లలో వాడుకోవచ్చు. అంటే ఒకే నంబర్‌పై వాట్సాప్ ఉన్నవారు దాన్ని మరో 3 డివైస్‌లలోనూ ఉపయోగించుకోవచ్చన్నమాట.
ఇక ఈ ఫీచర్ ప్రస్తుతం బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. బీటా వాట్సాప్ వెర్షన్ ను వాడుతున్న ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇక త్వరలోనే పూర్తి స్థాయిలో దీన్ని యూజర్లందరికీ వాట్సాప్ అందించనుంది.
కాగా వాట్సాప్ తాను అమలు చేయనున్న కొత్త ప్రైవసీ పాలసీపై ఇటీవలే కీలకమైన నిర్ణయాన్ని ప్రకటించింది. డేటా ప్రొటెక్షన్ బిల్లు అమలులోకి వచ్చే వరకు కొత్త ప్రైవసీ పాలసీ అమలును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు ఫేక్ వార్తలను ప్రచారం చేసే యూజర్ల అకౌంట్లను కూడా వాట్సాప్ పెద్ద ఎత్తున నిషేధిస్తోంది.