ఏప్రిల్ 21 న దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. భక్తులకు ప్రవేశం లేకుండా స్వామి వారికి జరగాల్సిన ఉత్సవాలన్నీ కేవలం అర్చకుల సమక్షంలోనే ఎంతో నిరాడంబరంగా జరిపించారు. ఈ శ్రీరామనవమిని పురస్కరించుకొని ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన సూక్ష్మ విగ్రహాల కళాకారుడు సత్యనారాయణ మొహరానా ఓ అద్భుతమైన ఆవిష్కరణ చేశారు.
ప్రపంచంలోకెల్లా అత్యంత చిన్నదైన రాముడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ రాముడి విగ్రహం కేవలం 4.1సెంటీ మీటర్లు మాత్రమే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..”ఈ ఏడాది శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఈ విగ్రహాన్ని రూపొందించాను. ఈ విగ్రహాన్ని చెక్కపై చెక్కానని” ఆయన తెలిపారు.
గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా శ్రీరామనవమి పండుగకు కరోనా కేసులు అధికంగా ఉండడంతో భక్తులందరూ ఇంటికి పరిమితమై ఇంటిలోనే శ్రీరామనవమి వేడుకలను జరుపుకున్నారు.ఈ మహమ్మారి నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరు తప్పకుండా జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్భంగా కళాకారుడు సత్యనారాయణ తెలిపారు