ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాల్చడంతో రోజురోజుకు కేసుల సంఖ్య లక్షలలో నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే అధికారులు కరోనా కట్టడికి ఎంతో పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు. బయటకు వెళ్ళిన ప్రతి ఒక్కరు తప్పకుండా సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు. మాస్కులు ధరించని వారి దగ్గరి నుంచి జరిమానాలను కూడా విధిస్తోంది.
ఈ క్రమంలోనే మాస్క్ ధరించడం ఇష్టంలేని ఓ మహిళ తన అతి తెలివితేటలను ప్రదర్శించింది. కరోనా నిబంధనలలో ఉన్న లోపాలను అడ్డుపెట్టుకుని సదరు మహిళ తాళ్లను మాస్క్ ఆకారంలో మూతి, ముక్కుకి కట్టుకుంది. ఈ విధంగా ఆ మహిళ అతితెలివి ప్రదర్శించడమే కాకుండా ఇది కూడా మాస్క్ కావాలంటే చూడండి.. ఇది కూడా ముక్కు, మూతిని కవర్ చేస్తుందని చెబుతోంది.
ఏది ఏమైనా ఇలాంటి మూర్ఖులు సమాజంలో ఎటువంటి జాగ్రత్తలు పాటించకుండా తిరగడం వల్లే కరోనా కేసులు రోజురోజుకూ అధికమవుతున్నాయి. వీరు జాగ్రత్తలు పాటించకుండా కరోనా బారిన పడటమే కాకుండా మరికొందరికి వ్యాధి వ్యాప్తి చేస్తున్నారు. ప్రస్తుతం వ్యాపిస్తున్న ఈ మహమ్మారి నుంచి ప్రాణాలను దక్కించుకోవాలంటే తగు జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.