Horoscope : జోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికలను చాలా ముఖ్యమైనవిగా పరిగణిస్తారు. ప్రతి గ్రహం యొక్క కదలికలు అన్ని రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తాయి. కొంత మందికి ఈ కదలికలు మంచి ఫలితాలను ఇస్తే మరికొందరికి ఇవి ప్రతికూలమైన ఫలితాలను ఇస్తాయి. జోతిష్య శాస్త్ర ప్రకారం ఏప్రిల్ 13న సూర్యుడు మేష సంక్రమణం చెందబోతున్నాడు. దీంతో ఏప్రిల్ 13 తరువాత ఈ 5 రాశుల వారికి మంచి రోజులు రానునాయని జోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. ఏప్రిల్ 13 తరువాత మేలు జరిగే 5 రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యుని సంక్రమణం వల్ల మేషరాశి వారికి ఎంతో మేలు కలుగుతుంది. ఉద్యోగస్తులకు ఇది ఎంతో మంచి కాలం అని చెప్పవచ్చు. అలాగే వారికి ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. వ్యాపారస్తులకు కూడా లాభాలు చేకూరుతాయి. కుటుంబ జీవితం మెరుగుపడుతుంది.
తల్లిదండ్రులతో గడిపే సమయం దొరుకుతుంది. అలాగే వైవాహిక జీవితంలో ఉండే సమస్యలు కూడా తొలుగుతాయి. అలాగే సూర్యుని సంక్రమణం వల్ల వృషభ రాశి వారికి కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. ఆర్థికంగా లాభాలు పెరుగుతాయి. శ్రామికులకు జీతాలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉన్నాయి. కుటుంబంతో బంధాలు మెరుగుపడుతాయి. వృషభ రాశి వారు నూతన పనులు మొదలు పెట్టడానికి ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి కూడా ఏప్రిల్ 13 తరువాత మంచి కాలం వస్తుంది. ఉద్యోగస్తులకు ఇది చాలా మంచి కాలం. ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబంతో చక్కటి సమయాన్ని గడుపుతారు. అలాగే చేస్తున్న పనుల్లో ఆటంకాలు తొలగిపోయి విజయాలు చేకూరుతాయి. అదృష్టం వీరి వెన్నంటే ఉంటుందని పండితులు చెబుతున్నారు.
అలాగే సూర్యుని సంక్రమణం వల్ల కన్యా రాశి వారికి కూడా మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఉద్యోగస్తులు వారు పని చేసే చోట గౌరవాన్ని పొందుతారు. వైవాహిక జీవితం కూడా మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది. కొత్త ఆదాయ మార్గాలు సమకూరుతాయి. ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది. అయితే సంపాదించిన డబ్బును ఖర్చు పెట్టకుండా దాచుకోవడం ముఖ్యం. అలాగే ధనస్సు రాశి వారికి కూడా సూర్యుని సంక్రమణం వల్ల మంచి రోజులు రానున్నాయి. ధనస్సు రాశి వారు ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారంలో లాభాలు చేకూరుతాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. అలాగే ఉద్యోగస్తులకు కూడా ఇది మంచి కాలం అని పండితులు చెబుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…