Sri Rama Navami 2024 : శ్రీరాముడు చైత్ర మాసం శుక్ల పక్షం నవమి రోజున జన్మించాడన్న సంగతి మనకు తెలిసిందే. ఆ రోజున మనం ఎంతో భక్తి శ్రద్దలతో అంగరంగవైభవంగా శ్రీరామనవమిని జరుపుకుంటాము. అయోధ్య మహారాజు దశరథుడు మరియు తల్లి కౌసల్య యొక్క కుమారుడిగా శ్రీరాముడు జన్మించాడు. తల్లి కౌసల్యకు శ్రీరాముడు తన గొప్ప రూపాన్ని దర్శనం ఇచ్చినప్పుడు కౌసల్య అతన్ని చిన్న పిల్లలా ఆడుకోమని ముకుళిత హస్తాలతో అభ్యర్థించింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ 17వ తేదీన మనం శ్రీరామనవమిని జరుపుకోనున్నాము. ఈ రోజు చాలా ప్రత్యేకమైనది. కనుక ఈ రోజు ప్రత్యేక పూజలు చేయడం వల్ల జీవితంలో సమస్యల నుండి మనం చాలా సులభంగా బయటపడవచ్చు.
శత్రువుల సమస్య కూడా తగ్గుతుంది. శ్రీరామనవమి నాడు ప్రత్యేక పూజలు చేయడం వల్ల మనకు కలిగే శుభఫలితాల గురించి తెలుసుకుందాం. ఇంట్లో వారి పుట్టిన రోజును జరుపుకున్నట్టే ఈ రోజు శ్రీరాముడి పుట్టిన రోజును జరుపుకోవాలి. మీ స్వంత చేతులతో ఇంట్లోనే తీపిని తయారు చేసి అందరికి పంచి పెట్టాలి. అలాగే ఈ రోజు హనుమంతునికి కూడా ప్రత్యేకంగా పూజలు చేయాలి. ఆశ్వీరాదం ఇస్తున్న భంగిమలో ఉన్న హనుమాన్ చిత్రాన్ని ఉంచి, ఈ చిత్రం ముందు కూర్చుని పూజ చేయాలి. రామచరితమానస్ లోని రామావతారంలోని ద్విపదలను చదవాలి. అలాగే చప్పట్లు కొడుతూ శ్రీ రామ్ జై రామ్ జైజై రామ్ అనే మంత్రాన్ని చదవాలి. ఇలా చేయడం వల్ల హనుమంతుని కృప మన మీద ఉంటుంది.
జీవితంలో ఉండే కష్టాలు తొలగిపోతాయి. ఇలా కుటుంబంలోని అందరూ చేయడం వల్ల కుటుంబ సభ్యుల కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇంటిల్లిపాది సుఖ సంతోషాలతో గడుపుతారు. అలాగ శత్రు భయం ఉన్న వారు శ్రీరామనవమి రోజున ఎర్రటి వస్త్రంపై శ్రీరాముడి దర్బార్ ఫోటోను ఉంచి పూల మాలలతో అలంకరించాలి. తరువాత నెయ్యి దీపం వెలిగించి భజనలు , కీర్తనలు చేయాలి. రామరక్ష స్తోత్రాన్ని చదవాలి. ఇలా చేయడం వల్ల సుధారన్ కవచాన్ని పొందుతారు. ఇలా చేసిన వారిని హనుమంతుడు ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటాడు. శ్రీరామనవమి రోజు నుండి రోజూ రామరక్షా స్తోత్రాన్ని చదవడం అలవాటు చేసుకోంది. ఇలా చేయడం వల్ల శత్రవుల భయం తగ్గుతుంది. శ్రీరామనవమి నాడు ఈ విధంగా చేయడం వల్ల జీవితంలో కష్టాలు, చేస్తున్న పనుల్లో ఆటంకాలు తొలిగిపోవడంతో పాటు శత్రవుల పీడ నుండి కూడా విముక్తి కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారని పండితులు చెబుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…