మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా… ఈవిధంగా డబ్బులను పొదుపు చేయాలి అనుకునే వారికి పోస్ట్ ఆఫీస్ అద్భుతమైన స్కీమ్ మీ ముందుకు తీసుకు వస్తోంది. తక్కువ మొత్తంలో అదిరిపోయే రాబడిని పొందాలనుకునే వారికి ఇది ఎంతో ప్రయోజనకరమైనది. మరెందుకు ఆలస్యం ఈ స్కీమ్ వివరాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
పోస్ట్ ఆఫీస్ ఇప్పటివరకు అందిస్తున్న ఎన్నో పథకాలలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ PPF స్కీమ్ కూడా ఒకటి. ఇందులో డబ్బులు పెడితే ఎలాంటి రిస్క్ లేకుండా మంచి రాబడిని పొందవచ్చు. మీరు ఈ పథకంలో చేరి ప్రతిరోజు కేవలం రూ.100 లను పొదుపు చేస్తే చాలు ఏకంగా 10 లక్షలను పొందవచ్చు. ఈ పథకం కింద సంవత్సరానికి 500 నుంచి 1.5 లక్షల వరకు పొదుపు చేసుకోవచ్చు.
ప్రస్తుతం ఈ పథకం పై కేంద్ర ప్రభుత్వం పీపీఎఫ్‌పై 7.1 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. ఈ స్కీమ్ కాలపరిమితి 15 సంవత్సరాలు.ప్రతి నెల 3000 చొప్పున ఈ స్కీమ్ కింద పొదుపు చేస్తే 15 సంవత్సరాల తర్వాత ఏకంగా 10 లక్షల రూపాయలను పొందవచ్చు.ఈ విధమైనటువంటి పోస్ట్ ఆఫీస్ పథకాలలో డబ్బులు పొదుపు చేయడం వల్ల మన డబ్బుకు భద్రత ఉండడమే కాకుండా, అధిక రాబడిని కూడా పొందవచ్చు.