నటుడు, మూవీ క్రిటిక్ కత్తి మహేష్ ఆరోగ్యానికి సంబంధించి సోషల్ మీడియాలో పలు పుకార్లు వైరల్ అవుతున్నాయి. అతనికి ఎడమ కన్ను చూపు కోల్పోయిందని, అతడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనే వార్తలు షికార్లు చేస్తున్నాయి. అయితే ఇవన్నీ కేవలం పుకార్లు మాత్రమేనని అతడి సన్నిహితవర్గాలు తెలియజేశారు.
జూన్ 26 తెల్లవారుజామున నెల్లూరు హైవేలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కత్తి మహేష్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.సీటు బెల్టు పెట్టుకోకపోవడం వల్ల కత్తి మహేష్ తలకు గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే తలకు, ఎడమ కంటికి కొద్దిగా గాయాలు కావడం వల్ల సర్జరీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న అతడి సన్నిహితులు మహేష్ మెల్లి మెల్లిగా కోలుకుంటున్నారని, కొద్దిగా ఫ్లూయిడ్స్ తాగడం వంటివి చేస్తున్నారని,ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలిపారు.సర్జరీ తర్వాత మూడు వారాలలో ఎంతో ఆరోగ్యంగా ఇంటికి చేరుకుంటారని తెలిపారు. అయితే మహేష్ ఆరోగ్య పరిస్థితి గురించి వస్తున్న వదంతులు కేవలం కొందరు గిట్టని వారు మాత్రమే ఇలా సృష్టిస్తున్నారని, అయితే అవన్నీ అపోహలేనని అతని ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుందని ఈ సందర్భంగా మహేష్ సన్నిహితులు తెలిపారు.