పేరు వినగానే తినాలనిపించే వంటలలో పన్నీర్ నగేట్స్ ఒకటి. ముఖ్యంగా పిల్లలు ఎంతో ఈ రెసిపీ మీ తయారు చేయడం ఎంతో సులభం. ఎన్నో పోషకాలు కలిగిన ఈ పన్నీర్ నగేట్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
*పన్నీర్ 200 గ్రాములు
*బ్రెడ్ ముక్కలు 4
*అల్లం వెల్లుల్లి పేస్ట్ 1టేబుల్ స్పూన్
*కారం టీ స్పూన్
*మొక్కజొన్నపిండి అరకప్పు
*మైదాపిండి 2 టేబుల్ స్పూన్లు
*నిమ్మకాయ సగం
*నూనె తగినంత
*కొత్తిమీర తురుము
తయారీ విధానం
ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, కొత్తిమీర, ఉప్పు, నిమ్మకాయ రసం వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. ఇందులోకి క్యూబ్ షేప్ లో కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసి బాగా కలిపి అరగంట పాటు మ్యారినేట్ చేయాలి.
తర్వాత బ్రెడ్ ముక్కలను తీసుకుని ఒక ఫాన్ పై టేబుల్ స్పూన్ నూనె లేదా నెయ్యి వేసి బ్రెడ్ ముక్కలు గోధుమ వర్ణంలో వచ్చే వరకు అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి. ఈ బ్రెడ్ ముక్కలను గది ఉష్ణోగ్రత వద్ద చల్లబరచాలి.
ఇప్పుడు మరొక గిన్నెలోకి మొక్కజొన్న పిండి, మైదా పిండి, చిటికెడు ఉప్పు వేసి పిండి మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలోకి ముందుగా కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను ఇందులో వేయాలి. అలాగే బ్రెడ్ ముక్కలను పొడిగా చేసి మరొక ప్లేట్లో పెట్టుకోవాలి. ఆ మిశ్రమంలో ఉన్న పన్నీర్ ముక్కలను తీసుకుని బ్రెడ్ పౌడర్ లో అటూ ఇటూ దొర్లించి బాగా వేడి నూనెలో వేసి బంగారువర్ణంలోకి వచ్చేవరకు వేయించుకోవాలి. ఈవిధంగా బంగారువర్ణంలోకి రాగానే పన్నీర్ నగేట్స్ కి కొద్దిగా టమోటా సాస్ తో వేడి వేడిగా తింటే ఎంతో రుచికరంగా ఉంటాయి.