మొబైల్స్ తయారీదారు ఒప్పో కొత్తగా ఎ74 5జి పేరిట ఓ స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఒప్పోకు చెందిన లేటెస్ట్ 5జి ఫోన్ ఇదే కావడం విశేషం. ఇందులో 6.5 ఇంచుల ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది. ఈ ఫోన్లో స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్, 6జీబీ ర్యామ్‌లను ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్ 11 ఓఎస్ లభిస్తుంది.
ఈ ఫోన్లో 48 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాకు తోడుగా మరో 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరా, 2 మెగాపిక్సల్ మోనో కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌కు పక్క భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది.
ఒప్పో ఎ74 5జి ఫీచర్లు
- 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 2400×1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
- ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్
- 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 11 ఓఎస్
- 48, 2, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
- సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5జి, డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ
- బ్లూటూత్ 5.1, యూఎస్బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్
ఒప్పో ఎ74 5జి స్మార్ట్‌ఫోన్ ఫ్లుయిడ్ బ్లాక్, ఫంటాస్టిక్ పర్పుల్ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. ఈ ఫోన్ ధర రూ.17,990 ఉండగా అమెజాన్ ఆన్లైన్ స్టోర్‌తోపాటు అన్ని ఆఫ్‌లైన్ స్టోర్లలో దీన్ని ఏప్రిల్ 26వ తేదీ నుంచి విక్రయించనున్నారు.
లాంచింగ్ సందర్బంగా ఈ ఫోన్‌పై ఎంపిక చేసిన బ్యాంకులకు చెందిన కార్డులతో 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు. 9 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం లభిస్తుంది. 2 ఏళ్ల వరకు ఎక్స్టెండెడ్ వారంటీ అందిస్తారు.
ఆఫ్‌లైన్ స్టోర్లలో అయితే హెచ్డీఎఫ్సీ, స్టాండర్డ్ చార్టర్డ్, కోటక్ మహీంద్రా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంక్ కార్డులతో 5 శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చు. పేటీఎం ద్వారా అయితే 11 శాతం ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్ అందిస్తారు. జీరో డౌన్ పేమెంట్‌తో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. అలాగే 6 నెలల నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కూడా అందివ్వనున్నారు.