చెన్నైలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 టోర్నీ 14వ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేయడంతో హైదరాబాద్ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించగలిగింది. ఈ క్రమంలో పంజాబ్‌పై హైదరాబాద్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆ జట్టు 19.4 ఓవర్లలో 120 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో ఎవరూ రాణించలేదు. మయాంగ్ అగర్వాల్, షారూఖ్ ఖాన్‌లు చెరో 22 పరుగులు చేశారు. జట్టును ఆదుకునే యత్నం చేసినా ఫలించలేదు. ఇక హైదరాబాద్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టగా అభిషేక్ శర్మ 2 వికెట్లు తీశాడు. భువనేశ్వర్ కుమార్, సిద్ధార్థ్ కౌల్, రషీద్ ఖాన్‌లకు తలా 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 18.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. 1 వికెట్ మాత్రమే కోల్పోయి 121 పరుగులు చేసింది. హైదరాబాద్ బ్యాట్స్‌మెన్లలో జానీ బెయిర్‌స్టో, వార్నర్‌లు అద్భుతంగా రాణించారు. 56 బంతుల్లో బెయిర్ స్టో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 63 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అలాగే వార్నర్ 37 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 37 పరుగులు చేశాడు. పంజాబ్ బౌలర్లలో ఫేబియన్ అలన్‌కు 1 వికెట్ దక్కింది.