ల్యాప్‌టాప్ లను తయారు చేసే అవిటా కంపెనీ కాస్మోస్ పేరిట ఓ 2 ఇన్ 1 ల్యాప్‌టాప్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. ఇందులో 11.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఇంటెల్ సెలెరాన్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్‌లను అమర్చారు. ఈ ల్యాప్‌టాప్‌ను ట్యాబ్లెట్ లేదా డెస్క్‌టాప్‌లా కూడా ఉపయోగించుకోవచ్చు. దీనికి డిటాచబుల్ కీబోర్డ్‌ను అందిస్తున్నారు.
అవిటా కాస్మోస్ ఫీచర్లు
- 11.6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1920×1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
- ఇంటెల్ సెలెరాన్ ఎన్4000 డ్యుయల్ కోర్ ప్రాసెసర్, ఇంటెల్ యూహెచ్‌డీ 600 గ్రాఫిక్స్
- 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్, విండోస్ 10 హోమ్
- 2 మెగాపిక్సల్ ఫ్రంట్, బ్యాక్ కెమెరాలు, 3.5 ఎంఎం ఆడియో జాక్, డిటాచబుల్ కీబోర్డ్
- డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.0, మినీ హెచ్‌డీఎంఐ పోర్ట్
- యూఎస్‌బీ, 6 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్
అవిటా కాస్మోస్ ల్యాప్‌టాప్ చార్‌కోల్ గ్రే కలర్ ఆప్షన్‌లో విడుదలైంది. ఈ ల్యాప్‌టాప్ ధర రూ.17,990. కాగా దీన్ని ఫ్లిప్‌కార్ట్‌తోపాటు రిలయన్స్ డిజిటల్ స్టోర్స్‌లలో కొనుగోలు చేయవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌కు 2 ఏళ్ల వారంటీని అందిస్తున్నారు.