దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఏర్పడిన ఈ క్లిష్ట పరిస్థితులలో మనుషుల్లో దాగి ఉన్న మానవత్వం పరిమళిస్తుంది. ఈ క్రమంలోనే మైసూర్ కు చెందిన హరీష్ అనే వ్యక్తి తన కూతురు పెళ్లి కోసం దాచిన డబ్బులను నిరుపేదలకు పంచి తన గొప్ప మనసును చాటుకున్నాడు.పూర్తి వివరాల్లోకి వెళితే..
కర్ణాటక, మైసూర్ కు చెందిన హరీష్ అనే వ్యక్తి ఈనెల 12వ తేదీన తన కూతురికి వివాహ నిశ్చయించాడు. తన కూతురి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిపించాలని పెద్ద ఎత్తున డబ్బును దాచుకున్నాడు. ఈ క్రమంలోనే కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో పెళ్లిళ్లపై నిషేధాజ్ఞలు విధించింది. ఈ క్రమంలోనే హరీష్ తన కూతురు వివాహం ఎంతో నిరాడంబరంగా జరిపించారు.
కూతురు పెళ్లి ఎంతో ఘనంగా జరిపించాలని దాచుకున్న డబ్బులను హరీష్ కష్టాల్లో ఉన్న పేదలకు పంచేయాలని నిర్ణయించుకున్నాడు.అనుకున్నదే తడవుగా అతను దాచి ఉంచిన రెండు లక్షల రూపాయలను 40 మంది పేద వారికి ఒక్కొక్కరికి ఐదు వేలు చొప్పున డబ్బులు పంచి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఈ విధంగా తన కూతురు కోసం దాచిన డబ్బులను పంచడంతో అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.