తౌక్టె తుఫాను కారణంగా అరేబియా సముద్ర తీరం ఉన్న రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తౌక్టె తుఫాన్ ప్రభావం ముంబై మీద కూడా పడింది. ముంబైలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. రహదారులన్నీ చెరువుల్లా మారాయి. అయితే తుఫాను కారణంగా ఓ చోట భారీ వృక్షం నేలకొరిగింది. కానీ ఆ ప్రమాదం నుంచి ఓ మహిళ అదృష్టవశాత్తూ తప్పించుకుంది.
ముంబైలోని విక్రోలి ఏరియాలో తౌక్టె తుఫాను కారణంగా వీచిన భారీ ఈదురు గాలులకు ఓ భారీ వృక్షం నేలకొరిగింది. అయితే అదే సమయంలో అటుగా ఓ మహిళ వచ్చింది. కానీ ఆ మహిళ ఇంకొన్ని అడుగులు వేసే లోపే వృక్షం కూలిపోయింది. దీంతో ఆమె ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. ఆ దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
#WATCH | Mumbai: A woman had a narrow escape when she managed to move away from the spot just in time as a tree uprooted and fell there. (17.05.2021)
Mumbai received heavy rain and wind yesterday in wake of #CycloneTauktae
(Source: CCTV footage) pic.twitter.com/hsYidntG7F
— ANI (@ANI) May 18, 2021
మహారాష్ట్రలో తుఫాను కారణంగా 6 మంది చనిపోగా ముగ్గురు మత్స్యకారులు గల్లంతయ్యారు. ముంబైలో అనేక చోట్ల భారీ వర్షాలు కూలిపోయాయి. రహదారులు చెరువుల్లా మారాయి. బాంద్రా-వొర్లి సముద్ర లింక్ రహదారిని ఇప్పటికే మూసివేశారు. ఈ క్రమంలో ముంబైలో ఈ నెలలోనే తాజాగా అత్యధిక వర్షపాతం నమోదైంది.