సాఫ్ట్‌వేర్ సంస్థ యాపిల్ ప్రతి ఏటా వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC)ని నిర్వహిస్తూ వస్తున్న విషయం విదితమే. అందులో భాగంగానే ఈసారి కూడా ఈ సదస్సును నిర్వహించనుంది. జూన్ 7వ తేదీన ఈ సదస్సు జరగనుంది. కరోనా వల్ల గతేడాది ఈ సదస్సును వర్చువల్‌గా నిర్వహించారు. ఇక ఈ సారి కూడా వర్చువల్‌గానే నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే సదస్సును ఆన్‌లైన్‌లో లైవ్‌లో వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
యాపిల్ ఈ సారి నిర్వహించనున్న తన WWDCలో ఐఓఎస్ 15తోపాటు ఐప్యాడ్ ఓఎస్ 15, మాక్ ఓఎస్ 12, వాచ్ ఓఎస్ 8, టీవీ ఓఎస్ 15లకు చెందిన వివరాలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక విద్యార్థుల కోసం యాపిల్ ప్రత్యేకంగా స్విఫ్ట్ స్టూడెంట్ చాలెంజ్‌ను నిర్వహిస్తోంది. విద్యార్థులు తమ కోడింగ్ నైపుణ్యాలను ఇందులో ప్రదర్శించవచ్చు. ఇందుకు గాను ఏప్రిల్ 18వ తేదీ వరకు గడువు నిర్ణయించారు.
కాగా యాపిల్ గతేడాది ఐఫోన్ ఎస్ఈ 2020ని ఎలాంటి ఈవెంట్ లేకుండానే విడుదల చేసింది. ఈ క్రమంలోనే ఈ ఫోన్‌కు గాను 2021 వేరియెంట్‌ను త్వరలో యాపిల్ విడుదల చేస్తుందా, లేదా..? అన్నది ఆసక్తికరంగా మారింది.