చైనాకు చెందిన మొబైల్స్ తయారీ కంపెనీ షియోమీ తన లోగోను మార్చింది. ఇంతకు ముంగు ఎంఐ అనే అక్షరాల చుట్టూ నారింజ రంగులో ఉన్న చతురస్రాకార బాక్స్ మూలలను ఇప్పుడు గుండ్రంగా వచ్చేలా చేసింది. అలాగే షియోమీ అనే అక్షరాల ఫాంట్‌ను కూడా మార్చింది. ఈ క్రమంలో షియోమీ భారత వినియోగదారులకు మరింత చేరువ కావాలని లోగోను అలా రూపొందించినట్లు తెలిపింది.
షియోమీ కొత్త లోగోను కెన్యా హెచ్ఏఆర్ఏకు చెందిన నిపాన్ డిజైన్ సెంటర్ ప్రెసిడెంట్, ముసాషినో ఆర్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకరు తయారు చేశారని షియోమీ వెల్లడించింది. తమ ప్రొడక్ట్స్ ఎక్కువగా యూత్‌ను ఆకర్షించేట్లు ఉంటాయని, అందుకనే లోగోను అలా డిజైన్ చేశామని తెలిపింది.
ఈ సందర్భంగా షియోమీ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లోకి ప్రవేశించినట్లు తెలిపింది. ఈ క్రమంలోనే రానున్న 10 ఏళ్లలో 10 బిలియన్ డాలర్లను ఈ రంగంలో పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆ సంస్థ తెలియజేసింది. అలాగే షియోమీ ఫౌండర్, చైర్మన్ లెయ్ జున్ స్మార్ట్ ఎలక్ట్రిక్ వాహనాల బిజినెస్‌కు కూడా సీఈవోగా ఉంటారని తెలిపింది.