అనేక నాటకీయ పరిణామాల మధ్య ఎట్టకేలకు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి స్పందించాడు. ఈ మధ్య కాలంలో కోహ్లిపై అనేక పుకార్లు వచ్చిన విషయం విదితమే. అయితే వాటిని కొట్టి పారేశారు. కానీ చివరకు వాటినే నిజం చేశారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఎన్నో ఏళ్ల నుంచి సేవలను అందిస్తున్నానని, సుదీర్ఘ చర్చల అనంతరం తాను టీ20 జట్టుకు కెప్టెన్‌గా తప్పుకుంటున్నానని కోహ్లి ప్రకటించాడు. ఈ మేరకు కోహ్లి తన సోషల్ ఖాతాల్లో ఈ ప్రకటన చేశాడు. అయితే టీ20లలో బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతానని తెలిపాడు. ఈ నిర్ణయాన్ని బీసీసీఐ సెక్రెటరీ జై షా, అధ్యక్షుడు సౌరవ్ గంగూలీలకు తెలిపానని అన్నాడు.
— Virat Kohli (@imVkohli) September 16, 2021
అయితే ఇటీవలే కోహ్లి గురించి పలు వార్తలు పుకార్లు షికార్లు చేశాయి. అతను త్వరలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ అనంతరం వన్డే, టీ20లకు కెప్టెన్‌గా తప్పుకుంటాడని వార్తలు వచ్చాయి. కానీ బీసీసీఐ వర్గాలు ఖండించాయి. అయితే ఆశ్చర్యంగా కోహ్లి అదే వార్తలను నిజం చేశాడు. వన్డేల సంగతి చెప్పలేదు కానీ, టీ20 వరల్డ్ కప్ అనంతరం టీ20లకు కెప్టెన్‌గా తప్పుకుంటానని మాత్రం ప్రకటించాడు. ఈ క్రమంలో టీ20లకు భారత్ కు రోహిత్ శర్మ ప్రాతినిధ్యం వహించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక కోహ్లి వన్డేలు, టెస్టులకు మాత్రమే కెప్టెన్‌గా కొనసాగనున్నాడు.