ముంబైలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 టోర్నీ 18వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ గెలుపొందింది. కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ సునాయాసంగానే ఛేదించింది. ఈ క్రమంలో కోల్‌కతాపై రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా కోల్‌కతా బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో రాహుల్ త్రిపాఠి మాత్రమే ఫర్వాలేదనిపించాడు. మిగిలిన ఎవరూ ఆకట్టుకోలేదు. 26 బంతులు ఆడిన త్రిపాఠి 1 ఫోర్, 2 సిక్సర్లతో 36 పరుగులు చేశాడు. రాజస్థాన్ బౌలర్లలో క్రిస్ మోరిస్ 4 వికెట్లు పడగొట్టగా, జయదేవ్ ఉనడ్కట్, చేతన్ శకారియా, ముస్తాఫిజుర్ రహమాన్‌లకు తలా 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. 4 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్ సంజు శాంసన్ రాణించాడు. 41 బంతులు ఆడిన శాంసన్ 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో 42 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీయగా, శివమ్ మావి, ప్రసిధ్ కృష్ణలకు చెరొక వికెట్ దక్కింది.