కరోనా ప్రఖ్యాత వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ తయారు చేస్తున్నటువంటి “కొవాగ్జిన్”ధరలను ప్రకటించింది. ఈ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రైవేట్ ఆస్పత్రులకు వేరువేరుగా ధరలను నిర్ణయిస్తూ శనివారం రాత్రి ప్రకటన జారీ చేసింది. భారత బయోటెక్ అందించేకొవాగ్జిన్ రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్కో డోసు రూ.600 కాగా, ప్రైవేట్ ఆస్పత్రులకు రూ.1200 లుగా నిర్ణయించింది.
భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసే ఈ వ్యాక్సిన్ కరోనా వ్యాక్సిన్ ను ఎంతో సమర్థవంతంగా ఎదుర్కోవడంతో వీటి వినియోగం అధికంగా ఉంది. ఈ వ్యాక్సిన్ ను విదేశాలకు ఎగుమతి చేసే టీకా ధర 15 నుంచి 20 డాలర్ల మధ్య ఉంటుందని ఈ సంస్థ తెలియజేసింది.
భారత్ బయోటెక్ సంస్థ ఉత్పత్తి చేస్తున్న ఈ వ్యాక్సిన్ తేలికపాటి, మధ్యస్థాయి, తీవ్రమైన కరోనా వ్యాధిపై దాదాపు 78% సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిపింది. ఈ వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల ప్రతి ఒక్కరికి 100% ఈ కరోనా వైరస్ నుంచి రక్షణ ఉంటుందని, వ్యాధితో ఆస్పత్రులకు వెళ్లి చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదని ఈ సంస్థ వెల్లడించింది.