భారతీయుల ప్రతిభను ప్రోత్సహించడంలో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఎప్పుడూ ముందే ఉంటారు. అందులో భాగంగానే తాజాగా ఆయన క్రికెటర్లు శార్దూల్ ఠాకూర్, టి.నటరాజన్‌లకు వారి ప్రతిభకు ప్రోత్సాహకంగా మహీంద్రా కంపెనీకి చెందిన థార్ కార్లను బహుకరించారు. అయితే ఆనంద్ మహీంద్రా పంపిన గిఫ్ట్‌లను అందుకున్న ఆ క్రికెటర్లు ట్విట్టర్‌లో ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ పోస్టులు పెట్టారు.
ఆస్ట్రేలియాలో జరిగిన బార్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం విదితమే. అందులో పలువురు యువ క్రికెటర్లు అద్భుతంగా రాణించారు. దీంతో ఆనంద్ మహీంద్రా అప్పట్లోనే వారిని ప్రశంసించారు. అయితే తాజాగా వారిలో శార్దూల్ ఠాకూర్, టి.నటరాజన్‌లకు ఆయన థార్ కార్లను బహుమతులుగా పంపించారు. ఆ కార్లను పొందిన ఠాకూర్, నటరాజన్‌లు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.
New Mahindra Thar has arrived!! @MahindraRise has built an absolute beast & I’m so happy to drive this SUV. A gesture that youth of our nation will look upto. Thank you once again Shri @anandmahindra ji, @pakwakankar ji for recognising our contribution on the tour of Australia. pic.twitter.com/eb69iLrjYb
— Shardul Thakur (@imShard) April 1, 2021
కొత్త మహీంద్రా థార్ వచ్చింది. మహీంద్రా కంపెనీ రూపొందించిన ఈ కార్ అద్భుతంగా ఉంది. దీన్ని పంపింనందుకు ఆనంద్ మహీంద్రాకు కృతజ్ఞతలు.. అంటూ శార్దూల్ ఠాకూర్ ట్వీట్ చేశాడు. అలాగే నటరాజన్ కూడా ట్వీట్ చేశాడు. భారత్‌కు ఆడుతున్నందుకు గర్వంగా ఉందని, కార్‌ను గిఫ్ట్‌గా పంపినందుకు ధన్యవాదాలని, ఆనంద్ మహీంద్రాకు తన ఆటోగ్రాఫ్‌తో కూడిన షర్ట్‌ను పంపిస్తానని చెప్పాడు.
?????? Thank you Nattu. I will treasure the return present & wear it with pride… @Natarajan_91 https://t.co/KxciWdQ1ai
— anand mahindra (@anandmahindra) April 2, 2021
అయితే నటరాజన్ ట్వీట్‌కు ఆనంద్ మహీంద్రా స్పందించారు. ఆ షర్ట్‌ను ఓ సంపదలా దాచుకుంటానని, గర్వంగా దాన్ని ధరిస్తానని తెలిపారు. ఈ క్రమంలో వారి మధ్య జరిగిన ట్వీట్ల సంభాషణ వైరల్‌గా మారింది. నెటిజన్లు తమ దైన శైలిలో ఈ విషయం పట్ల స్పందిస్తున్నారు.