ఆఫ్‌బీట్

Doomsday Fish : స‌ముద్రంలో ఆ చేప క‌నిపించింది.. యుగాంతానికి ఇది సంకేత‌మా..?

Doomsday Fish : గ‌తంలో 2012లో యుగాంతం వ‌స్తుంద‌ని మ‌య‌న్ల క్యాలెండ‌ర్‌, నాస్ట్రోడోమ‌స్ అంచ‌నాల‌ను బ‌ట్టి చెప్పారు. కానీ యుగాంతం జ‌ర‌గ‌లేదు. అయితే క‌లియుగం ఎప్పుడు అంతం అవుతుంది.. అన్న విష‌యంపై కూడా స్ప‌ష్ట‌త లేదు. కానీ యుగాంతం అయిన‌ప్పుడు మాత్రం ఎటు చూసినా జ‌ల ప్ర‌ళ‌య‌మే ఉంటుంద‌ని మ‌న పురాణాలు చెబుతున్నాయి. త‌రువాత కొన్ని ఏళ్ల‌కు మ‌ళ్లీ సృష్టి క్రమం ప్రారంభ‌మ‌వుతుంద‌ని పురాణాల్లో చెప్పారు. అయితే వీటి సంగ‌తేమో కానీ కొంద‌రు మాత్రం త్వ‌ర‌లో యుగాంతం రాబోతుంద‌ని, అందుకు ఆ చేప క‌నిపించ‌డ‌మే సూచ‌న‌.. అని చెబుతున్నారు. ఇంత‌కీ అస‌లు ఆ చేప ఏమిటి.. దానికి, యుగాంతానికి సంబంధం ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆగ‌స్టు 10, 2024వ తేదీన అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న తీర ప్రాంతానికి ఒక చేప కొట్టుకు వ‌చ్చి స‌ముద్ర‌పు నీటిలో క‌నిపించింది. చూసేందుకు ఒక పొడ‌వైన రిబ్బ‌న్‌ను పోలి ఆ చేప ఉంది. కానీ అది చ‌నిపోయి ఉంది. ఆ చేప అరుదైన జాతికి చెందిన చేప అని సైంటిస్టులు నిర్దారించారు. దీన్నే ఓర్‌ఫిష్ అని లేదా డూమ్స్‌డే ఫిష్ అని అంటారు. అంటే యుగాంతం వ‌చ్చే ముందు ఈ చేప స‌ముద్రంలో క‌నిపిస్తుంద‌న్న‌మాట‌. అందుక‌నే దీనికి డూమ్స్‌డే ఫిష్ అని కూడా పేరు పెట్టారు.

Doomsday Fish

చేప ఎందుకు చ‌నిపోయిందో తెలియ‌దు..

ఇక ఈ చేప‌ను అమెరికాలోని నేష‌న‌ల్ ఓషియానిక్ అండ్ అట్మాస్పియ‌రిక్ అడ్మినిస్ట్రేష‌న్స్ (ఎన్‌వోఏఏ) అనే చోటుకు త‌ర‌లించారు. అక్క‌డ సైంటిస్టులు ఈ చేప‌పై క్షుణ్ణంగా ప్ర‌యోగాలు చేశారు. ఈ చేప‌ను పూర్తిగా ప‌రిశీలిన అనంత‌రం అక్క‌డి సైంటిస్టులు వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ఈ చేప చూస్తే ఆరోగ్యంగానే ఉంద‌ని, కానీ ఎందుకు చ‌నిపోయిందో తెలియ‌ద‌ని చెప్పారు.

యుగాంతానికి ఇదే సూచ‌న‌..?

ఇక ఈ చేప 12.25 అడుగుల పొడ‌వు, 1.14 అడుగుల వెడ‌ల్పు ఉంద‌ని, దీని బ‌రువు 33.7 కిలోలుగా ఉంద‌ని తెలిపారు. ఈ చేప‌లు సాధార‌ణంగా స‌ముద్రం పై భాగానికి రావ‌ని, స‌ముద్ర గ‌ర్భంలోనే ఉంటాయ‌ని చెబుతున్నారు. అయితే కొంద‌రు ఔత్సాహికులు మాత్రం త్వ‌రలో యుగాంతం రాబోతుంద‌ని, దానికి సూచ‌న‌గానే ఈ చేప స‌ముద్రంలో క‌నిపించింద‌ని అంటున్నారు. అయితే ఈ చేప క‌నిపించిన త‌రువాత 2 రోజుల‌కు అమెరికాలోని లాస్ ఏంజ‌ల‌స్‌లో భూకంపం రావ‌డం విశేషం. రిక్ట‌ర్ స్కేలు భూకంప తీవ్ర‌త 4.4 గా న‌మోదు అయింది. అందువ‌ల్లే కొంద‌రు యుగాంతానికి ఈ చేప సూచ‌న అని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM