Mushrooms : గ్రామీణ ప్రాంతాల్లో మనకు ఈ సీజన్‌లో ఎక్కడ చూసినా పొలాలు, చేల గట్ల మీద పుట్టగొడుగులు ఎక్కువగా దర్శనమిస్తుంటాయి. పల్లెటూళ్లలో చాలా మంది పుట్టగొడుగులను తెంపుకుని వచ్చి తింటుంటారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అయితే మనకు సూపర్ మార్కెట్‌లలోనూ పుట్ట గొడుగులు లభిస్తాయి. ఆధునిక యుగం వచ్చిన తరువాత మనకు పుట్టగొడుగులు కూడా ఏడాది పొడవునా అందుబాటులో ఉంటున్నాయి. అయితే పుట్ట గొడుగులను ఈ సీజన్‌లో తినడం మాత్రం మరిచిపోవద్దు. వీటితో మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. పుట్ట గొడుగులను వర్షాకాలంలో తినడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
పుట్టగొడుగుల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అందువల్ల ఈ సీజన్‌లో వీటిని తింటే దగ్గు, జలుబు, జ్వరం వంటి వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. రోగాల నుంచి త్వరగా కోలుకుంటారు. పుట్టగొడుగుల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో హైబీపీ తగ్గుతుంది. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
పుట్టగొడుగుల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీటిని తింటే ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కుగా తింటారు. ఫలితంగా శరీరంలో క్యాలరీలు తక్కువగా చేరుతాయి. దీంతో శరీరం శక్తి కోసం కొవ్వును కరిగిస్తుంది. ఫలితంగా అధిక బరువు తగ్గుతారు. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారికి పుట్టగొడుగులు వరమనే చెప్పవచ్చు. వీటిని తింటే విటమిన్ డి కూడా సమృద్ధిగానే లభిస్తుంది. దీంతో ఎముకలు దృఢంగా మారుతాయి. విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయి.
పుట్టగొడుగులను తినడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. వయస్సు మీద పడిన తరువాత మతిమరుపు రాకుండా చూసుకోవచ్చు. అలాగే వీటిని తింటే ఎన్నో రకాల బి విటమిన్లు, కాపర్, సెలీనియం, థయామిన్, మెగ్నిషియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలు లభిస్తాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రోగాలు రాకుండా మనల్ని రక్షిస్తాయి. కనుక ఈ సీజన్‌లో పుట్టగొడుగులను తినడం మరిచిపోకండి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…