వినోదం

Akkineni Nagarjuna Net Worth : అక్కినేని నాగార్జున ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే నోరెళ్ల‌బెడ‌తారు..!

Akkineni Nagarjuna Net Worth : యువ సామ్రాట్‌గా తెలుగు సినీ ప్రేక్ష‌కుల గుండెల్లో చిర‌స్థాయిగా ముద్ర వేసుకున్న అక్కినేని నాగార్జున గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయ‌న వార‌స‌త్వంతో న‌టుడిగా ఎంట్రీ ఇచ్చినా త‌న‌దైన న‌ట‌నా శైలితో అంద‌రి మ‌న్న‌న‌లు పొందారు. ఈయ‌న‌కంటూ ప్ర‌త్యేక ఫ్యాన్స్ ఏర్ప‌డ్డారు. తెలుగుతోపాటు ఎన్నో బాలీవుడ్ చిత్రాల్లో సైతం నాగార్జున నటించారు. అయితే నాగార్జున ఈ మ‌ధ్య ఎక్కువ‌గా వార్త‌ల్లో నిలిచారు. మాదాపూర్ హైటెక్‌సిటీలో ఉన్న ఎన్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌ను తెలంగాణ ప్ర‌భుత్వం కూల్చివేయ‌డంతో ఒక్క‌సారిగా నాగార్జున పేరు మారుమోగిపోతోంది.

నాగార్జున ఆస్తి ఎంత..?

తెలంగాణ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన హైద‌రాబాద్ డిజాస్ట‌ర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిట‌రింగ్ అండ్ ప్రొటెక్ష‌న్ (హైడ్రా) టీమ్ నాగార్జున‌కు చెందిన ఎన్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌ను కూల్చివేసింది. ప‌క్క‌నే ఉన్న తుమ్మ‌డి కుంట చెరువు ఎఫ్‌టీఎల్ జోన్‌ను ఆక్ర‌మించి నాగార్జున ఎన్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌ను నిర్మించార‌ని చెబుతూ అధికారులు ఆ సెంట‌ర్‌ను నేల‌మ‌ట్టం చేశారు. ఈ సంఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారింది. అయితే తెలంగాణ హైకోర్టుకు వెళ్లి నాగార్జున స్టే తెచ్చుకున్న‌ప్ప‌టికీ అప్ప‌టికే స‌మ‌యం మించిపోయింది. ఎన్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ పూర్తిగా నేల‌మ‌ట్టం అయింది. అయితే ఈ విష‌యం అటుంచితే ఇప్పుడు నాగార్జున ఆస్తిపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ఇంత‌కీ అస‌లు ఆయ‌న ఆస్తి ఎంత ఉంటుంది ? అని అంద‌రూ ఆరా తీస్తున్నారు. ఇక అవే వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

Akkineni Nagarjuna Net Worth

అనేక విధాలుగా ఆదాయం..

సౌతిండియాలోనే అత్యంత భారీ ఎత్తున ఆస్తులు ఉన్న స్టార్ హీరోల్లో నాగార్జున ఒక‌రు. ఈయ‌న ఆస్తి విలువ సుమారుగా రూ.3010 కోట్లుగా ఉంటుంద‌ని స‌మాచారం. నాగార్జున అనేక విధాలుగా ఆదాయం పొందుతున్నారు. ఈయ‌న ఒక సినిమాకు రూ.20 కోట్ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటార‌ని తెలుస్తోంది. అదే ఒక టీవీ షో ఎపిసోడ్ కు అయితే రూ.5 కోట్ల వ‌ర‌కు వ‌సూలు చేస్తార‌ని స‌మాచారం. ఈయ‌న హోస్ట్‌గా ఇప్ప‌టికే స్టార్ మాలో ప్ర‌తి ఏడాది బిగ్ బాస్ షో నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. ఇక ఈయ‌న న‌టించే ఒక్కో యాడ్‌కు రూ.2 కోట్ల వ‌ర‌కు తీసుకుంటార‌ట‌. అలాగే తన సినిమాల‌కు వ‌చ్చే లాభాల్లోనూ ఈయ‌న‌కు షేర్ ఉంటుంద‌ట‌.

ఏడాది ఆదాయం ఎంతంటే..?

ఇక నాగార్జున నెల‌కు దాదాపుగా రూ.4 కోట్లు సంపాదిస్తార‌ని, ఆయ‌న వార్షికాదాయం సుమారుగా రూ.50 కోట్ల వ‌ర‌కు ఉంటుందని తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే నాగార్జున దేశంలోనే అత్య‌ధిక ఆదాయ‌పు ప‌న్ను చెల్లిస్తున్న న‌టుల్లో ఒక‌రిగా ఉన్నారు. ఇక నాగార్జున‌కు గతంలో మాటీవీ ఉండేది. కానీ స్టార్ నెట్‌వ‌ర్క్‌కు దాన్ని విక్ర‌యించిన త‌రువాత అందులో కొంత వాటాను మాత్రం త‌న ద‌గ్గ‌రే ఉంచుకున్న‌ట్లు తెలుస్తోంది. అలాగే స్టార్ మా వ్య‌వ‌హారాల‌ను కూడా నాగార్జున చూస్తుంటార‌ట‌. దీంతోపాటు ఆయ‌న‌కు అన్న‌పూర్ణ స్టూడియోస్ కూడా ఉంది. అలాగే హైటెక్ సిటీలో అన్న‌పూర్ణ ఇంట‌ర్నేష‌నల్ స్కూల్ ఆఫ్ ఫిలిం అండ్ మీడియా అనే ఓ కాలేజీ కూడా ఉంది. ఇందులో ఔత్సాహికులకు సినిమా రంగంలోని వివిధ విభాగాల్లో శిక్ష‌ణ ఇస్తుంటారు.

రూ.200 కోట్ల విలువైన స్టూడియో..

నాగార్జున‌కు అత్యంత ఖ‌రీదైన బంగ్లాలు కూడా ఉన్నాయి. హైద‌రాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో ఆయ‌న ఉంటున్న ఇంటి ఖ‌రీదు రూ.50 కోట్లుగా ఉంటుంద‌ని స‌మాచారం. అలాగే రూ.42.3 కోట్ల విలువైన మ‌రో ఇల్లు కూడా ఆయ‌న‌కు హైద‌రాబాద్‌లో ఉంద‌ట‌. దీంతోపాటు హైద‌రాబాద్‌లో సెవెన్ ఎక‌ర్ ఫిలిం స్టూడియో కూడా నాగార్జున‌కు ఉంది. దీని విలువ సుమారుగా రూ.200 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని స‌మాచారం.

ఖ‌రీదైన కార్లు కూడా..

నాగార్జున‌కు విలాస‌వంత‌మైన కార్లు అంటే ఎంతో ఇష్టం. ఆయ‌న వ‌ద్ద ఖ‌రీదైన కార్లు చాలానే ఉన్నాయి. బీఎండబ్ల్యూ 7 సిరీస్‌కు చెందిన ఓ కారు ఆయ‌న‌కు ఉంది. దాని విలువ సుమారుగా రూ.1.50 కోట్లు. ఔడి ఎ7 అనే రూ.90 ల‌క్ష‌ల విలువైన మ‌రో కారు కూడా ఉంది. బీఎండ‌బ్ల్యూ ఎం6 కార్ కూడా ఉంది. దీని విలువ రూ.1.76 కోట్లు. పోర్షె కాయెన్ అనే మ‌రో కారు కూడా ఈయ‌న‌కు ఉంది. దీని విలువ సుమారుగా రూ.2 కోట్ల వ‌ర‌కు ఉంటుంది. బీఎండ‌బ్ల్యూ 5 సిరీస్‌కు చెందిన కారు కూడా ఈయ‌న వ‌ద్ద ఉంది. దీని ఖ‌రీదు రూ.1.50 కోట్లు. ఇలా నాగార్జున సౌతిండియా స్టార్ హీరోల్లో అత్యంత సంప‌న్నుల్లో ఒక‌రిగా ఉన్నారు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM