Cyber Cheating : సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త మార్గాల్లో మోసాలు చేస్తున్నారని, ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ఓ వైపు ఎంత చెబుతున్నా కూడా కొందరు వ్యక్తులు ఇంకా అపరిచితులను నమ్మి మోసపోతూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఇలాంటిదే ఓ సంఘటన చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో పరిచయం అయిన ఓ వ్యక్తిని నమ్మిన ఆ యువతి ఏకంగా లక్షల రూపాయలను పోగొట్టుకొంది. ఈ సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగినికి ఇటీవలే ఫేస్‌బుక్‌లో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. అతడు తనను తాను నితిన్ పటేల్‌గా పరిచయం చేసుకున్నాడు. తాను యూకేలో ఉంటున్నానని, బ్రిటిష్ ఎయిర్‌వేస్‌లో పైలట్‌గా పనిచేస్తున్నానని నమ్మబలికాడు. అయితే అతనితో ఆమె స్నేహం చేసింది. ఆమె వివరాలను రాబట్టిన అతను ఆమెకు ఓ పార్సిల్ పంపించాడు.
అయితే ఆ పార్సిల్ లాజిస్టిక్స్ వారి వద్ద ఆగిపోయిందని, కస్టమ్స్ ఫీజు చెల్లించాలని ఓ యువతి ఆ ఉద్యోగినికి ఫోన్ కాల్ చేసింది. అది నిజమే అని నమ్మిన ఆ ఉద్యోగిని ముందుగా రూ.55వేలను చెల్లించింది. అయితే ఆమె నుంచి విడతల వారిగా అవతలి వారు అలా డబ్బు వసూలు చేస్తూనే ఉన్నారు. దీంతో మొత్తం ఆమె వారికి రూ.27 లక్షలను అలా చెల్లించింది. అయితే చివరకు తాను మోసపోయానని ఆమె గ్రహించి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతోపాటు సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది.
సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో ఎట్టి పరిస్థితిలోనూ స్నేహం చేయవద్దని, సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయని, కనుక ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…