వైర‌ల్

Viral Video : హైద‌రాబాద్‌లో న‌డిరోడ్డుపై నోట్ల క‌ట్ట‌లు.. దొరికినోళ్ల‌కు దొరికినంత‌..!

Viral Video : ఈ మ‌ధ్య కాలంలో సోష‌ల్ మీడియా ప్ర‌భావం అంద‌రిలోనూ ఎలా ఉందో అంద‌రికీ తెలిసిందే. ఆ మాయ‌లో ప‌డి కొంద‌రు ప్రాణాల‌నే పోగొట్టుకుంటున్నారు. రీల్స్ పేరు చెప్పి సాహ‌సాలు చేస్తూ లోయ‌ల్లో ప‌డి ప్రాణాల‌ను కోల్పోతున్నారు. అయితే ఆ వ్య‌క్తి అంత‌టి సాహ‌సం చేయ‌లేదు కానీ సోష‌ల్ మీడియాలో ఫాలోవ‌ర్లు, లైకుల కోసం అత్యంత చెత్త ప‌ని చేశాడు. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే..

యూట్యూబ‌ర్ అయిన ప‌వ‌ర్ హ‌ర్ష అలియాస్ మ‌హాదేవ్ అనే వ్య‌క్తి హైద‌రాబాద్ లోని కూక‌ట్‌ప‌ల్లిలో న‌డిరోడ్డుపై బైక్ పై వెళ్తూ రోడ్డు మీద క‌రెన్సీ నోట్ల‌ను వెద‌జ‌ల్లాడు. మ‌రో చోట కూడా రోడ్డు మ‌ధ్య‌లో నిల‌బ‌డి అదే ప‌ని చేశాడు. రోడ్డు మ‌ధ్య‌లో నిలుచుని క‌రెన్సీ నోట్ల‌ను ధాన్యం చ‌ల్లిన‌ట్లు చ‌ల్లాడు. అయితే డ‌బ్బును అలా చూసే స‌రికి వాహ‌న‌దారులు, పాద‌చారులు ఆ డ‌బ్బును ఏరుకునేందుకు ఎగ‌బ‌డ్డారు. దీంతో దొరికినోళ్ల‌కు దొరికినంత డ‌బ్బు వ‌చ్చింది.

Viral Video

నెటిజ‌న్ల ఆగ్ర‌హం..

అయితే మ‌హాదేవ్ మొత్తంగా అలా రూ.50వేల‌ను వెద‌జల్లిన‌ట్లు తెలిసింది. కానీ అత‌ని వీడియోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ కావ‌డంతో నెటిజన్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అత్యంత ర‌ద్దీగా ఉండే రోడ్ల‌పై అలా డ‌బ్బుల‌ను విసిరితే వాటిని ఏరుకునేందుకు జ‌నాలు ఎగ‌బ‌డితే ప్ర‌మాదాలు జ‌రిగే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. సోష‌ల్ మీడియాలో స‌బ్‌స్క్రైబ‌ర్ల‌ను పెంచుకునేందుకు అత‌ను ఇలా చేయ‌డం క‌రెక్ట్ కాద‌ని, ఎవ‌రికైనా ఏదైనా జ‌రిగి ఉంటే బాధ్య‌త ఎవ‌రు తీసుకుంటారు.. అని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. కంటెంట్ క్రియేట్ చేసేందుకు ఇలాంటి దారి ఎంచుకోవ‌డం సరికాద‌ని అంటున్నారు. వెంట‌నే ఆ వ్య‌క్తిపై పోలీసులు కేసు పెట్టి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అత‌ని వీడియోల‌ను పోలీసుల‌కు ట్యాగ్ కూడా చేస్తున్నారు.

అయితే ఆ వ్య‌క్తిపై ఇప్ప‌టి వ‌రకు పోలీసులు మాత్రం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేదు. కానీ యూట్యూబ్‌లో ఫేమ‌స్ అవ‌డం కోస‌మే అత‌ను ఇలా చేస్తున్న‌ట్లు వెల్ల‌డించాడు. తాను రానున్న రోజుల్లో కూడా ఇలాగే చేస్తాన‌ని, రోడ్డు మీద తాను ఎంత డ‌బ్బును వెద‌జ‌ల్లుతాడో క‌చ్చితంగా చెప్పేవారికి మంచి రివార్డుల‌ను కూడా ఇస్తాన‌ని అత‌ను చెప్ప‌డం విశేషం. మ‌రి పోలీసులు ఈ విష‌యంపై దృష్టి సారిస్తారో లేదో చూడాలి.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM