ముంబైలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఆడపిల్ల పుట్టిందని అత్తింటి వారు తరచూ వేధింపులకు గురి చేస్తుండడంతో.. ఆ మహిళ తన 3 నెలల పసికందును చంపేసింది. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
ముంబైలోని కాలాచౌకీ ప్రాంతంలో ఉన్న సంఘర్ష్ సదన్ బిల్డింగ్‌లో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. ఆ కుటుంబానికి చెందిన 36 ఏళ్ల మహిళకు కుటుంబ సభ్యులు ఇప్పటికే 3 సార్లు అబార్షన్ చేశారు. ఆమెకు ఆడపిల్ల పుడుతుందని అంజనం వేసిన మాంత్రికులు చెప్పగా.. ఆడపిల్ల వద్దనుకున్న ఆ కుటుంబ సభ్యులు ఆమెకు అబార్షన్ చేయించారు.
అయితే ఇప్పుడు ఆమె 4వ సారి గర్భం దాల్చింది. కానీ ఈసారి బిడ్డను కనాలని కుటుంబ సభ్యులు చెప్పారు. అయితే ఆ మహిళ ఆడపిల్లకు జన్మనిచ్చింది. దీంతో గత 3 నెలల నుంచి ఆమెను అత్తింటివారు వేధింపులకు గురి చేయసాగారు.
ఆడపిల్లను కన్నావని తరచూ ఆ మహిళను నిందిస్తూ వేధించసాగారు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన ఆ మహిళ తన బిడ్డను తానే చంపుకుంది. నీళ్ల ట్యాంకులో ముంచి ప్రాణాలను తీసింది. కానీ అందరికీ తన బిడ్డను ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఆ మహిళ నేరం తానే చేశానని అంగీకరించింది. దీంతో ఆమెను రిమాండ్‌కు తరలించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…