Molathadu : అస‌లు మొలతాడును ఎందుకు ధ‌రిస్తారు ? దాని వ‌ల్ల ఏం జ‌రుగుతుంది ? తెలుసా ?

Molathadu : పూర్వ కాలం నుంచి హిందువులు మొల‌తాడును క‌ట్టుకోవ‌డం ఆచారంగా వ‌స్తోంది. ఇప్పుడు చాలా మంది మొల‌తాడును ధ‌రించ‌డం లేదు. కానీ మొల‌తాడు వ‌ల్ల ప‌లు లాభాలు క‌లుగుతాయ‌ని, దాన్ని త‌ప్ప‌నిసరిగా ధ‌రించాల‌ని పెద్ద‌లు చెబుతుంటారు. అయితే మొల‌తాడును ధ‌రించ‌డం వ‌ల్ల అటు ఆధ్యాత్మిక ప‌రంగా, ఇటు సైన్స్ ప‌రంగా.. ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. మొల‌తాడు రూపంలో స‌హ‌జంగానే చాలా మంది న‌ల్ల‌నిదారాన్ని క‌ట్టుకుంటారు. దీని వ‌ల్ల దుష్ట‌శ‌క్తుల ప్ర‌భావం మ‌న‌పై ఉండ‌దు. అలాగే నెగెటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎన‌ర్జీ వ‌స్తుంది. దీంతో అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా దిష్టి త‌గ‌ల‌కుండా ఉంటుంది.

2. ఇప్పుడంటే టెక్నాల‌జీ అందుబాటులోకి వ‌చ్చింది క‌నుక ఏ చిన్న అనారోగ్య స‌మ‌స్య వ‌చ్చినా వెంట‌నే హాస్పిట‌ల్ కు వెళ్ల‌గ‌లుగుతున్నాం. కానీ ఒక‌ప్పుడు అలా ఉండేది కాదు. మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో ల‌భించే ఆకుల‌ను, వేర్ల‌ను ఉప‌యోగించి వైద్యం చేసుకునేవారు. ఈ క్ర‌మంలోనే పాము, తేలు వంటివి కుట్టిన‌ప్పుడు వెంట‌నే మొల‌తాడును తీసి గ‌ట్టిగా బిగించి క‌ట్టి విషం తీసేవారు. అందుక‌నే మొల‌తాడు క‌ట్టుకోవాల‌ని పెద్ద‌లు చెబుతుంటారు.

3. మొల‌తాడును ధ‌రించ‌డం వ‌ల్ల బ‌రువును అదుపులో ఉంటుందని, జీర్ణ‌క్రియ మెరుగు ప‌డుతుంద‌ని చెబుతుంటారు.

4. కొంద‌రికి బాన‌పొట్ట ఉంటుంది. అది రాకుండా ఉండాలంటే మొల‌తాడు ధ‌రించాల‌ని సూచిస్తుంటారు.

5. మొల‌తాడు ధ‌రించ‌డం వ‌ల్ల హెర్నియా రాకుండా అడ్డుకోవ‌చ్చు. వెన్నెముక‌కు స‌పోర్ట్ ల‌భిస్తుఏంది. వెన్ను స‌మ‌స్య‌లు ఉన్న‌వారు మొల‌తాడును ధ‌రించాలని చెబుతుంటారు.

6. మొల‌తాడును ధ‌రించ‌డం వ‌ల్ల జ‌న‌నావ‌య‌వాలు ఆరోగ్యంగా ఉంటాయ‌ట‌. అందుక‌నే కొన్ని ప్రాంతాల్లో పురుషులే కాదు, స్త్రీలు కూడా మొల‌తాడును ధ‌రిస్తుంటారు.

7. పూర్వం పురుషులు బెల్ట్‌ల‌ను ధ‌రించేవారు కాదు. అందువ‌ల్ల కింద ధ‌రించే వ‌స్త్రాలు జారిపోతాయేమోన‌ని మొల‌తాడును ధ‌రించి మీద‌కు వేసుకునేవారు. అలా మొల‌తాడును కొంద‌రు ధ‌రిస్తున్నారు.

8. పూర్వ‌కాలంలో మొల‌తాడుకు ఒక తాయ‌త్తును క‌ట్టేవారు. అందులో వారికి చెందిన బొడ్డు తాడు మూల‌క‌ణాలు ఉంటాయి. పుట్టిన‌ప్పుడు మంత్ర‌సానులు ఆ బొడ్డుతాడును తీసి అవి ఎప్ప‌టికీ పాడ‌వ‌కుండా ఉండేందుకు వాటికి ఏవో ప‌స‌రు మందులు రాసి తాయత్తులో పెట్టి క‌ట్టేవారు. దీంతో ఆ వ్య‌క్తికి భ‌విష్య‌త్తులో లివ‌ర్ వ్యాధులు, క్యాన్స‌ర్ వంటి వ్యాధులు వ‌చ్చిన‌ప్పుడు ఆ మూల‌క‌ణాల‌ను తీసి చికిత్స చేసేవారు. ఇప్పుడు స్టెమ్ సెల్స్ థెర‌పీలాగేన‌న్న‌మాట‌. అందుక‌నే అప్ప‌ట్లో ఆ తాయ‌త్తు కోసం కూడా మొల‌తాడును క‌ట్టుకునేవారు.

9. ఒక కొంద‌రికి జాత‌క రీత్యా దోషాలు ఉంటాయి. వాటిని పోగొట్టుకునేందుకు వివిధ ర‌కాల యంత్రాలు, తాయ‌త్తుల‌ను ధ‌రిస్తుంటారు. కొన్నింటిని న‌డుముకు ధ‌రించాల్సి ఉంటుంది. అందుకు మొల‌తాడు ఉప‌యోగ‌ప‌డుతుంది. క‌నుక‌నే పూర్వ‌కాలం నుంచి మొల‌తాడును ధ‌రించ‌డం ఆచారంగా వ‌స్తోంది.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM