Tollywood : చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకుంటున్న టాలీవుడ్ పెద్ద‌లు..? ఏపీ ప్ర‌భుత్వం దిగి వ‌చ్చేనా..?

Tollywood : గత వారం రోజుల‌ క్రితం ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలలో అత్యధిక వర్షాలు కురవడంతో పలు జిల్లాలలో వరదలు సంభవించాయి. ఈక్రమంలోనే వాగులు, వంకలు పొంగి పొర్లడంతో ఎన్నో గ్రామాలు నీటిలో మునిగిపోయాయి. కొద్దిరోజుల పాటు జనజీవనం స్తంభించిపోయింది. ఇలా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలలోని ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

అధికంగా ప్రాణ నష్టం, పంట నష్టం, ఆస్తి నష్టం జరగడంతో ఏపీ ప్రభుత్వం వెంటనే సహాయక‌ చర్యలను చేప‌ట్టింది. కాగా ఏపీలో వచ్చిన వరదలను దృష్టిలో ఉంచుకొని పలువురు టాలీవుడ్ ఇండస్ట్రీ సెల‌బ్రిటీలు ఆంధ్రప్రదేశ్ కు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే మొదట ఎన్టీఆర్ పాతిక లక్షల విరాళాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కు పంపించగా ఆ వెంటనే మెగాస్టార్, రామ్ చరణ్, మహేష్ బాబు వెంట వెంటనే రూ.25 లక్షల‌ చొప్పున విరాళాలు ప్రకటించారు.

మరుసటి రోజు గీతాఆర్ట్స్ రూ.10 లక్షల విరాళం ప్రకటిస్తే వెంటనే అల్లుఅర్జున్ రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా ఈ టాప్ హీరోలందరూ పాతిక లక్షల రూపాయ‌ల‌ విరాళం ప్రకటించడంతో.. ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వీరందరూ పాతిక లక్షల రూపాయ‌ల‌ విరాళం ఎందుకు ప్రకటించారని సందేహాలు వ్యక్తపరుస్తున్నారు.

అయితే నిజానికి వీరు విరాళాలు ప్రకటించడానికి ముందే ఏపీ ప్రభుత్వం టికెట్ల విషయంలో జీవోను జారీ చేసింది. ఈ క్ర‌మంలో కొంద‌రు వైసీపీ నేత‌లు సినీ ఇండ‌స్ట్రీ సెల‌బ్రిటీల‌ను బ‌హిరంగంగానే విమ‌ర్శించారు. ప్ర‌జ‌లు ఇచ్చే డ‌బ్బుతో టాప్ హీరోలు అయిన వారు, ఇండ‌స్ట్రీలో ఎదిగిన వారు ఇప్పుడు ప్ర‌జ‌ల‌కు వ‌ర‌ద‌ల రూపంలో క‌ష్టాలు వ‌స్తే.. ప‌ట్టించుకోరా..? పైగా టిక్కెట్ల ధ‌ర‌ల‌ను పెంచాల‌ని, అద‌న‌పు షోల‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని అడుగుతారా ? అంటూ దుయ్య‌బట్టారు.

దీంతో ఏపీ ప్ర‌భుత్వంతో రాజీ కుదుర్చుకునేందుకేనా ? అన్న‌ట్లుగా హీరోలు, సినీ నిర్మాణ సంస్థ‌లు ఉన్న‌ట్లుండి హ‌డావిడిగా విరాళాల‌ను ప్ర‌క‌టిస్తున్నార‌ని అంటున్నారు. వాస్త‌వానికి టిక్కెట్ల రేట్లు, అద‌న‌పు షోల విష‌య‌మై ప‌లు మార్లు నిర్మాత‌లే సీఎం వైఎస్ జ‌గ‌న్‌, మంత్రి పేర్ని నానిల‌ను క‌లిశారు. హీరోలు క‌ల‌వ‌లేదు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున‌లు మాత్ర‌మే ప‌లు మార్లు జ‌గ‌న్‌ను క‌లిసి స‌మ‌స్య‌ల‌పై విన్న‌వించారు. అంతేకానీ మిగిలిన హీరోలు అటు వైపు చూడ‌లేదు. పైగా ఏపీ సీఎంగా జ‌గ‌న్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి ఒక్క చిరంజీవి, నాగార్జున త‌ప్ప ఎవ‌రూ ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు కూడా తెలప‌లేదు. ఈ క్ర‌మంలో తాజాగా జీవో రావ‌డం, సినిమా వాళ్ల‌కు మూలిగే న‌క్క మీద తాటికాయ ప‌డిన‌ట్లు అవ‌డంతో.. త‌ప్పును స‌రిదిద్దుకోవ‌డం కోస‌మేనా.. అన్న‌ట్లుగా ఉన్న‌ట్లుండి హ‌డావిడిగా విరాళాల‌ను ప్ర‌క‌టిస్తున్నారు.

అయితే ఇంత స‌డెన్‌గా విరాళాల‌ను ప్ర‌క‌టించినా ప్ర‌భుత్వం ఇప్ప‌టికిప్పుడు దిగి వ‌చ్చి జీవోను వెన‌క్కి తీసుకోదు క‌దా. క‌నుక సినిమా వాళ్లు ఏం ఆశించి విరాళాలు ఇస్తున్నారో తెలియ‌దు కానీ.. ప్ర‌భుత్వంతో రాజీ ప‌డేందుకు కొంత స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. మ‌రి అప్ప‌టి వ‌ర‌కు పెద్ద సినిమాలు విడుద‌లైతే ప‌రిస్థితి ఏమిటి ? అన్న‌ది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మ‌రి ఏపీ ప్ర‌భుత్వం సినిమా వాళ్ల‌పై జాలి, ద‌య చూపుతుందో, లేదో.. తెలియాల్సి ఉంది.

Share
Sailaja N

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM