Viral News : సాధారణంగా ఎవరైనా అభిమానులు సెలబ్రెటీలను అభిమానించడం మొదలు పెట్టారంటే వారి అభిమానానికి అంతు ఉండదని చెప్పవచ్చు. వారి అభిమాన హీరో హీరోయిన్ల పట్ల వివిధ రకాలుగా తమకు ఉన్న అభిమానాన్ని వ్యక్తపరుస్తారు. తాజాగా ఇలాంటి ఘటన ఒక గాయని విషయంలో చోటు చేసుకుంది. ఆమె పాటకు మైమరిచిపోయిన అభిమానులు ఆమెపై డబ్బుల వర్షం కురిపించారు. ఒక అభిమాని అయితే ఏకంగా బకెట్లతో ఆమెపై నోట్ల వర్షం కురిపించాడు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
గుజరాత్‌కు చెందిన శ్రీ సమస్త్ హరిద్వార్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఊర్వశి రాధాదియా అనే గుజరాతీ ఫోక్ సింగర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆమె పాడిన పాటకు అక్కడ ఉన్న ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ క్రమంలోనే ఆమె గాత్రానికి మైమరిచిపోయిన అభిమానులు ఆమె పాట పాడుతున్నంతసేపు ఆమెపై కాసుల వర్షం కురిపించారు.
https://www.instagram.com/reel/CWcTCK3Kk2n/?utm_source=ig_embed&utm_campaign=loading
కాగా ఒక అభిమాని ఒక బకెట్ నిండా డబ్బులు తీసుకువచ్చి ఆమెపై పోశాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను ఊర్వశి తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేయడంతో ఈ వీడియో కాస్తా వైరల్ గా మారింది.