Samantha : విడాకుల ప్రకటన తర్వాత సమంత సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన మనసులోని భావాలను సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరుస్తూ తన బాధను తగ్గించుకుంటోంది. కాగా సమంత సోషల్ మీడియా వేదికగా మరోసారి ఎంతో ఆసక్తికరమైన పోస్ట్ చేసింది.
సమంతకు అతి తక్కువ మంది స్నేహితులు ఉన్నారన్న సంగతి మనకు తెలిసిందే. అయితే వీరిలో సమంతకు వాయిస్ ఓవర్ ఇస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
సమంతకు ఉన్న అతి కొంతమంది స్నేహితులలో చిన్మయి ఎంతో ముఖ్యమైన స్నేహితురాలు. ఈ క్రమంలోనే చిన్మయి.. స్పా, బ్యూటీ సెంటర్ ‘డీప్ స్కిన్ డైలాగ్స్’ పేరిట స్టార్ట్ చేసింది. దీనిని సమంత చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఈ విషయానికి సంబంధించి సమంత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆసక్తికరమైన పోస్ట్ చేసింది.
https://www.instagram.com/p/CWexCNlhXzn/
బిజినెస్ పై చిన్మయికి ఉన్న ఆసక్తి గురించి.. తన స్టామినా గురించి.. నాకు తెలుసు, తాను తప్పకుండా విజయం సాధిస్తుంది. ఆమె స్టార్ట్ చేసిన మెడి స్పా.. సౌత్ ఏసియాలోనే తొలి హాలీవుడ్ స్కల్పింగ్ సెంటర్.. అని సమంత సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ.. సింగర్ చిన్మయిని సపోర్ట్ చేసింది. ప్రస్తుతం సమంత చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.