Vijay Devarakonda : లైగ‌ర్ ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌లో.. విజ‌య్ రూ.199 ధ‌ర క‌లిగిన స్లిప్ప‌ర్ల‌ను ధ‌రించాడు.. ఎందుకో తెలుసా..?

Vijay Devarakonda : రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, బాలీవుడ్ యంగ్ బ్యూటీ అన‌న్య పాండేల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మూవీ.. లైగ‌ర్. ఈ మూవీకి డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనుల‌ను జ‌రుపుకుంటోంది. ఈ క్ర‌మంలోనే పాన్ ఇండియా లెవ‌ల్‌లో రిలీజ్ కానున్న ఈ మూవీకి గాను తాజాగా ట్రైల‌ర్‌ను లాంచ్ చేశారు. లైగ‌ర్ టైటిల్ ట్రాక్ మీద సాగే ఈ ట్రైల‌ర్ అదిరిపోయింది. ఇందులో విజ‌య్ త‌న విశ్వ‌రూపం చూపించాడు. మాస్ కా బాప్ అనిపించుకున్నాడు. ఇందులో విజ‌య్ బాక్సింగ్ చాంపియ‌న్‌గా న‌టిస్తున్నాడు. మ‌రో కీల‌క‌పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ‌తోపాటు అంత‌ర్జాతీయ బాక్సింగ్ దిగ్గ‌జం మైక్ టైస‌న్ కూడా న‌టించారు.

కాగా లైగ‌ర్ ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌ను మొద‌ట హైద‌రాబాద్‌లో నిర్వ‌హించి అనంత‌రం చిత్ర యూనిట్ ముంబైకి వెళ్లింది. అక్క‌డ కూడా ఈ మూవీ హిందీ ట్రైల‌ర్‌ను లాంచ్ చేశారు. దీనికి పూరీ సొంత బ్యాన‌ర్ పూరీ క‌నెక్ట్స్‌తోపాటు క‌ర‌ణ్ జోహార్ బ్యాన‌ర్ ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ కూడా నిర్మాణ భాగ‌స్వామిగా ఉంది. ఇక ముంబైలో జ‌రిగిన ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న విజ‌య్ సింపుల్ లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చాడు. అయితే అంత‌టి స్టార్ అయిన విజ‌య్ ఆ ఈవెంట్‌కు రూ.199 ధ‌ర క‌లిగిన స్లిప్ప‌ర్ల‌ను ధ‌రించి వ‌చ్చాడు. దీంతో అంద‌రి చూపు ఆ స్లిప్ప‌ర్ల‌పై ప‌డింది. విజయ్ ఎందుకు అలా చీప్ ధ‌ర క‌లిగిన చెప్పుల‌ను ధ‌రించి వ‌చ్చాడు.. అని అంత‌టా చ‌ర్చ న‌డుస్తోంది. అయితే ఇందుకు ఆయ‌న స్టైలిస్ట్ హ‌ర్మాన్ మాట్లాడుతూ.. విజ‌య్ అస‌లు ఎందుకు స్లిప్ప‌ర్స్‌ను ధ‌రించాడో చెప్పారు.

Vijay Devarakonda

విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు సొంత దుస్తుల డిజైన్ స్టూడియో ఉంది. ఆ బ్రాండ్ పేరిట దుస్తుల‌ను కూడా విక్ర‌యిస్తున్నాడు. అయితే విజయ్ ధ‌రించే దుస్తుల‌ను స‌హ‌జంగానే చాలా మంది చూస్తుంటారు. ఆయ‌న ఏ కంపెనీకి చెందిన దుస్తుల‌ను, షూస్‌ను, వాచ్‌ల‌ను, క‌ళ్ల‌ద్దాల‌ను, క్యాప్‌ల‌ను ధ‌రిస్తున్నాడో.. వాటినే ఆయ‌న ఫ్యాన్స్ కొని ధ‌రించాల‌ని చూస్తుంటారు. అయితే ఆయ‌న ప‌లు బ్రాండ్ల‌కు చెందిన ఉత్పత్తుల‌ను ధరిస్తే వాటికి ప్ర‌మోష‌న్‌, ఫ్రీ ప‌బ్లిసిటీ చేసిన‌ట్లు అవుతుంది. ఇది విజ‌య్‌కు న‌ష్టం క‌లిగిస్తుంది. ముంద‌స్తుగా అగ్రిమెంట్ చేసుకుని ఆ బ్రాండ్‌కు చెందిన దుస్తుల‌ను ధ‌రిస్తే ఓకే. ఎలాగూ పెయిడ్ ప‌బ్లిసిటీ క‌నుక ఏమీ కాదు. కానీ ఏ బ్రాండ్ ఉత్ప‌త్తుల‌ను ప‌డితే వాటిని ధ‌రిస్తే.. వాటికి ఉచితంగా ప్ర‌మోష‌న్ చేసిన‌ట్లు అవుతుంది. దీంతో న‌ష్ట‌మే క‌లుగుతుంది. క‌నుక‌నే విజ‌య్ సింపుల్‌గా అలా స్లిప్ప‌ర్స్‌తో వ‌చ్చాడ‌ని చెప్పారు. కాగా లైగ‌ర్ మూవీ ఆగ‌స్టు 25న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతోంది.

Share
Editor

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM